Vivo V70e 5G : 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 7000mAh బ్యాటరీతో కొత్త వివో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V70e 5G Phone : వివో కొత్త ఫోన్ అదుర్స్.. ఇంకా లాంచ్ కాలేదు. కానీ, అంతలోనే వివో V70e ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలివే..

Vivo V70e 5G : 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 7000mAh బ్యాటరీతో కొత్త వివో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V70e Phone (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 4:48 PM IST
  • వివో V70e 5జీ ఫోన్ అతి త్వరలో లాంచ్
  • 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 7000mAh బ్యాటరీ
  • లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్
  • 2026 ఫిబ్రవరి నాటికి లాంచ్ అయ్యే ఛాన్స్

Vivo V70e 5G Phone : వివో లవర్స్ కు బిగ్ న్యూస్.. వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. లాంచ్‌కు ముందగానే వివో V70e 5G ఫోన్ స్పెషిఫికేషన్లు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. అలాగే, 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. అంతేకాదు.. 7000mAh బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. వివో V70e ఫోన్ ఇటీవల TÜV సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించింది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. వివో V70e ఫోన్ ఫీచర్లు, ధర లీక్‌కు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ధర, లాంచ్ తేదీ (అంచనా) :
వివో V70e 5జీ ఫోన్ 8GB ర్యామ్, ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ బేస్ మోడల్ రూ. 34,999 ధరకు లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. హై వేరియంట్‌లలో దాదాపు రూ. 44,999 వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం రాబోయే ఈ వివో ఫోన్ జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి 2026 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన లాంచ్ తేదీ, ధర అధికారికంగా రివీల్ చేయలేదు.

Vivo V70e Phone

Vivo V70e Phone (Image Credit To Original Source)

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
వివో V70e 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, సెకండరీ సెన్సార్ ఉండవచ్చు. అయితే, ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Best AI Phones : కొత్త ఏఐ ఫోన్ కావాలా? రూ. 30వేల లోపు 5 బెస్ట్ AI స్మార్ట్‌ఫోన్లు.. మూడో ఫోన్ కిర్రాక్ అంతే..!

అదే సమయంలో ఈ వివో ఫోన్ 7000mAh బ్యాటరీ ప్యాక్‌ కూడా అందిస్తుందని భావిస్తున్నారు. 2 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ కూడా పొందవచ్చు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా ఉంటుందని అంచనా.

డిస్‌ప్లే, డిజైన్ :
వివో V70e 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో రావొచ్చు. ఫుల్ HD+ రిజల్యూషన్ ఉండొచ్చు. ఇందులో 5G కనెక్టివిటీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో IP64 ఉండనుంది. ఇంకా, ఛార్జింగ్, ఆడియో కోసం USB టైప్-C పోర్ట్‌ కూడా ఉండే అవకాశం ఉంది.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
వివో V70e 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ వివో ఫన్‌టచ్ OS కస్టమ్ ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది.