Best AI Phones : కొత్త ఏఐ ఫోన్ కావాలా? రూ. 30వేల లోపు 5 బెస్ట్ AI స్మార్ట్‌ఫోన్లు.. మూడో ఫోన్ కిర్రాక్ అంతే..!

Best AI Phones 2026 : 2026 జనవరిలో ఏఐ ఫీచర్లతో అద్భుతమైన బెస్ట్ 5 ఫోన్లు మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి..

Best AI Phones : కొత్త ఏఐ ఫోన్ కావాలా? రూ. 30వేల లోపు 5 బెస్ట్ AI స్మార్ట్‌ఫోన్లు.. మూడో ఫోన్ కిర్రాక్ అంతే..!

5 Best AI Phones (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 3:34 PM IST
  • 2026 జనవరిలో బెస్ట్ ఏఐ పవర్డ్ కెమెరా ఫోన్లు
  • మోటోరోలా నుంచి ఒప్పో వరకు 5 ఏఐ స్మార్ట్‌ఫోన్లు
  • 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • ఏఐ గేమింగ్, ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ ఎఫిషియెన్సీ, ఏఐ టెక్స్ట్

Best AI Phones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీరు ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తుంటే ఈ స్టోరీ మీకోసమే.. ప్రత్యేకించి ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఏఐ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు.. ఇతర వర్క్ సంబంధిత టాస్కులు ఏమైనా ఏఐ ఫీచర్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.

ఈ ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మోటోరోలా నుంచి ఒప్పో వరకు బెస్ట్ 5 ఏఐ స్మార్ట్‌ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఈ లిస్టులో మీకు నచ్చిన ఏదైనా ఏఐ స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (రూ. 29,999) :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో 50MP + 10MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 1B కలర్‌తో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌లో మోటో ఏఐ కూడా ఉంది. సేవ్ చేసిన స్క్రీన్‌షాట్‌లు, నోట్స్, ఫొటోలన్నింటిని ట్యాగ్ చేస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (రూ. 22,999) :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 1B కలర్స్‌తో 6.67-అంగుళాల P-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 32MP సెల్ఫీ కెమెరాతో 50MP + 13MP రియర్ కెమెరా ఉంది. మోటో ఏఐతో అద్భుతమైన ఫొటోలు క్యాప్చర్ చేయొచ్చు.

5 Best AI Phones

5 Best AI Phones

రియల్‌మి P4 ప్రో (రూ. 24,999):
రియల్‌మి P4 ప్రోలో 50MP + 8MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 1B కలర్స్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఏఐ గేమింగ్, ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ ఎఫిషియెన్సీ, ఏఐ టెక్స్ట్ వంటి అనేక ఇతర ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

Read Also : iPhone 18 Pro Max : వారెవ్వా.. కొత్త ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్

ఒప్పో రెనో 13 (రూ. 29,939) :

ఒప్పో రెనో 13 ఫోన్ 1B కలర్స్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 8MP కెమెరాతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 5600mAh బ్యాటరీ కూడా ఉంది.

ఒప్పో K13 టర్బో 5జీ (రూ. 27,999) :
ఒప్పో K13 టర్బో 5Gలో 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8450 ద్వారా పవర్ పొందుతుంది. ఏఐ స్క్రీన్ డిటెక్టర్లు, ఏఐ ఎరేజర్‌ అందిస్తుంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ 1B కలర్ ఆప్షన్లలో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.