iPhone 18 Pro Max : వారెవ్వా.. కొత్త ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ధర, కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్
iPhone 18 Pro Max : అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రాబోతుంది. లాంచ్ తేదీ, డిజైన్, స్పెషిఫికేషన్లు, కెమెరా వంటి పూర్తి ఫీచర్లు లీక్ అయ్యాయి..
iPhone 18 Pro Max (Image Credit To Original Source)
- 2026 లాంచ్‌కు ముందు కొత్త ఫ్రంట్ డిజైన్
- A20 ప్రో చిప్, కెమెరా అప్‌గ్రేడ్ ఆప్షన్లు,
- సెప్టెంబర్ 2026 రెండో వారంలో లాంచ్ అయ్యే ఛాన్స్
- ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు లీక్
iPhone 18 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ వచ్చేస్తోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత మరో కొత్త ప్రో లైనప్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. కంపెనీ 2026 ఏడాదిలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లను లాంచ్ చేయనుంది. ఇంకా, ప్రో మాక్స్ వేరియంట్‌కు సంబంధించిన లీక్‌లు, పుకార్లు బయటకు వచ్చాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..
భారత్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర, లాంచ్ తేదీ :
ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్‌కు సంబంధించిన అనేక లీకులు వస్తున్నాయి. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో సహా ప్రో వేరియంట్‌లు ఈ ఏడాది లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఐఫోన్ 18e మోడల్ బేస్ వేరియంట్ ఉంటుందని సూచిస్తున్నాయి.
ఆపిల్ పాత సంప్రదాయాన్ని ఫాలో అయితే మాత్రం ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026 రెండో వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 1,54,900కు లాంచ్ కావచ్చు.
Read Also : Samsung Galaxy S24 5G : వావ్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 5Gపై అమెజాన్ స్పెషల్ ఆఫర్.. ధర, డిస్కౌంట్ వివరాలివే..!
ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిజైన్, కెమెరా స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ నుంచి అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఆపిల్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయొచ్చు. కానీ ఐఫోన్ లాంచ్ తర్వాత రెండు కొత్త కలర్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

iPhone 18 Pro Max (Image Credit To Original Source)
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. 48MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 18MP స్నాపర్ కూడా ఉండొచ్చు.
ఐఫోన్ 18 ప్రో మాక్స్ 6.9-అంగుళాల ప్రోమోషన్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఈ ఐఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆపిల్ A20 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 40W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు.
