Motorola Edge 60 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్.. ఈ మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ. 32వేలు ఆదా..!

Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (12GB + 256GB) మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.30,399గా ఉండొచ్చు.

Motorola Edge 60 Pro

  • మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోపై రూ.3,600 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది
  • ఈ ఫోన్‌లో 50MP కెమెరా, డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.32వేల వరకు ఆదా చేసుకోవచ్చు

Motorola Edge 60 Pro : మోటోరోలా ఫోన్ లవర్స్ మీకోసమే.. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. 4nm ప్రాసెస్‌పై ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది. 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర ఇంకా పెరగలేదు. ప్రస్తుతం ఒక ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న డీల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో డీల్ :
ఈ మోటోరోలా బేస్ వేరియంట్ 12GB + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.33,999 ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ.3,600 క్యాష్‌బ్యాక్ వంటి బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. తద్వారా ధర రూ.30,399 అవుతుంది.

Read Also : Lava Virat Curve : AI ఫీచర్లు, డ్యూయల్ డిస్‌ప్లేతో లావా విరాట్ కర్వ్ 5G వస్తోంది.. లాంచ్ డేట్ ఫిక్స్..!

కో-బ్రాండెడ్ కార్డ్ లేకుంటే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు. అంతేకాదు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ.32వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, పాత ఫోన్ ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ 4nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఎడ్జ్ 60 ప్రో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. ఎడ్జ్ 60 ప్రో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. 90W టర్బోపవర్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.0 అపర్చర్‌తో 50MP ఫొటో ఫోకస్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఎడ్జ్ 60 ప్రోలోని కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.4, వై-ఫై 6E, 5G, NFC, GPS కనెక్టివిటీ ఉన్నాయి.