×
Ad

Motorola Edge 70 Fusion : మిడ్ రేంజ్‌లో మోటోరోలా కొత్త సంచలనం.. ఒక్కసారి చార్జ్ చేస్తే 2 రోజులు టెన్షన్ లేదు… వేరియంట్ వారీగా ధరలివే!

Motorola Edge 70 Fusion : మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్ భారీ 7000mAh బ్యాటరీతో వచ్చేసింది. వేరియంట్ల వారీగా ఏ ఫోన్ ధర ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. 

Motorola Edge 70 Fusion

  • భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్ లాంచ్
  • 6.78-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
  • 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 హలో యూఐ
  • ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 6న ఫస్ట్ సేల్, మార్చి 12న ఓపెన్ సేల్‌లో రూ. 2వేలు డిస్కౌంట్ 

Motorola Edge 70 Fusion : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మోటోరోలా ఇండియా నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌‌తో ఎడ్జ్ 70 సిరీస్‌ను కంపెనీ విస్తరించింది. ఈ కొత్త ఫోన్ అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్, ఏఐ ఫీచర్లతో పాటు కెమెరా అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. అంతేకాదు.. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్ప్లెక్సిటీతో సహా మల్టీ ఏఐ అసిస్టెంట్‌లతో ఇంటిగ్రేట్ అయి ఉంది.

క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, ఫాబ్రిక్ ఆధారిత రియర్ డిజైన్ భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందిస్తుంది. భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర, స్పెసిఫికేషన్లు, లభ్యతకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 6.78-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో ప్రొటెక్షన్ అందిస్తుంది.

Read Also  : Samsung Galaxy S25 FE 5G : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై బ్రహ్మాండమైన డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

హుడ్ కింద ఈ మోటోరోలా ఫోన్ 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 4473mm² స్టీమ్ రూమ్ కూడా ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 7,000mAh బ్యాటరీతో వస్తుంది.

ఆండ్రాయిడ్ 16 ఆధారంగా హలో యూఐపై రన్ అవుతుంది. కంపెనీ 3 మెయిన్ OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌లు, MIL-STD-810H సర్టిఫికేషన్, Wi-Fi 6E, NFC, డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP సోనీ LYTIA 710 మెయిన్ సెన్సార్‌, OISతో పాటు 13MP అల్ట్రా-వైడ్, మాక్రో కెమెరాతో వస్తుంది. 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ మోటోరోలా ఫోన్ అన్ని కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్, హారిజన్ లాక్, అడాప్టివ్ స్టెబిలైజేషన్ వంటి ఏఐ టూల్స్ కూడా అందిస్తుంది.

భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర ఎంతంటే? :

  • మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొత్తం 3 వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
  • మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8GB+128GB : రూ. 26,999
  • మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8GB+256GB : రూ. 29,999
  • మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 12GB+256GB : రూ. 32,999

మోటోరోలా మార్చి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా లిమిటెడ్ సేల్ ప్రకటించింది. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంట్రీ ఆఫర్‌గా రూ. 2వేల వరకు ఆదా చేసుకోవచ్చు.