Motorola Edge 70 Pro : రూ.70వేల మోటోరోలా ప్రో ఫోన్ జస్ట్ రూ.35,149కే.. ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ రాదు బ్రో..!

Motorola Edge 70 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ రూ.39,999కే లభిస్తోంది. యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్‌తో రూ.35,149కే పొందవచ్చు. 144Hz డిస్‌ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6500mAh బ్యాటరీ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.. ?

Motorola Edge 70 Pro

  • రూ.35 వేలకే మోటోరోలా 144Hz స్మార్ట్‌ఫోన్..
  • 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదిరిపోయే డీల్
  • యాక్సస్ బ్యాంక్ కార్డుతో ఇంకా తక్కువ ధరకే

Motorola Edge 70 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మంచి డిస్‌ప్లే, అదిరిపోయే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో అద్భుతమైన ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటో ఫోన్‌ ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరకు లభిస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ ద్వారా మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

రూ.35,149కే మోటోరోలా ఫోన్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.69,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999కే లభిస్తోంది. దీనికి ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్ అప్లయ్ చేస్తే ఈ ఫోన్ ధర రూ.35,149కు తగ్గుతుంది..

అయితే, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ సాధారణంగా ఫోన్ డెలివరీ తర్వాత అందుతుంది. అదనంగా రూ.199 ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.42,999గా ఉంది.

ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. మీడియాటెక్ డైమన్షిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ అద్భుతంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హాలో యూఐతో వస్తుంది..

Read Also : Vivo T5 5G Discount : వివో T5 5G కొనేవారికి పండగే.. రూ.49,999 ఫోన్ జస్ట్ రూ.29 వేలకే.. ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..!

కెమెరాల విషయానికి వస్తే.. 50MP సోనీ ఎల్వైటీఐఏ మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఇచ్చారు. అయితే, ఇందులో స్పెషల్ టెలిఫొటో కెమెరా లేదు..

బ్యాటరీ, ఛార్జింగ్ స్పెషల్ :
6500mAh భారీ బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా అందించారు. IP68, IP69 రేటింగ్స్ ఉండటం మరో స్పెషాలిటీగా చెప్పొచ్చు..

పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. గరిష్ఠంగా రూ.27,450 వరకు పొందవచ్చు.. మరో ప్రత్యేక ఎక్స్‌ఛేంజ్ ఆప్షన్ ద్వారా అదనంగా రూ.5వేలు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఈ రెండు ఆఫర్లు ఆప్షన్లు మాత్రమే.. రెండూ కలిపి పొందలేరు..

అదిరిపోయే డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునేవారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఆర్డర్ చేసే ముందు బ్యాంక్ ఆఫర్, ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఎంత ఉందో ఓసారి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు..