Motorola Edge 70 Pro+ : ట్రిపుల్ రియర్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Motorola Edge 70 Pro : మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో కోసం ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో స్పెషల్ మైక్రోసైట్ క్రియేట్ అయింది. ట్రిపుల్ రియర్ కెమెరాలతో అతి త్వరలో లాంచ్ కానుంది. పూర్తి వివరాలివే..

Motorola Edge 70 Pro

  • మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ రెక్టాంగులర్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్
  • మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో గత నెలలో చైనాలో లాంచ్

Motorola Edge 70 Pro+ : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ ఫోన్ రాబోతున్నాయి. చైనాకు కంపెనీ మోటోరోలా అతి త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో గత నెలలో దేశంలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌కు త్వరలో మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ కూడా రిలీజ్ చేయనుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ దాదాపుగా మోటరోలా ఎడ్జ్ 70 ప్రో మాదిరిగానే ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ మైక్రోసైట్ క్రియేట్ అయింది. అతి త్వరలో లాంచ్ కానుందని కంపెనీ సూచిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టు కాలేదు. ఈ మైక్రోసైట్ URL, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రౌన్, రెడ్, టీల్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+లో రెక్టాంగులర్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ స్మార్ట్‌ఫోన్‌కు రైట్ సైడ్ ఉంటాయి.

Read Also : Lava Shark 2 5G : లావా షార్క్ 2 5G రాబోతోంది.. 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అదిరే ఫీచర్లు!

ఫ్రంట్ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16GB వరకు ర్యామ్ ఉండవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రోలో 6.8-అంగుళాల 1.5K 10-బిట్ ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ డిస్‌ప్లే (2,772×1,272 పిక్సెల్స్) ఉంటుంది.

రిఫ్రెష్ రేట్ 144Hz, టాప్ బ్రైట్ నెస్ 5,200 నిట్స్ అందిస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్, ఆర్మ్ మెయిల్-G720 MC8 జీపీయూ ద్వారా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ ఆటోఫోకస్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, సింగిల్ USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 3 OS అప్‌గ్రేడ్‌లు అందుబాటులో ఉంటాయి.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ఫోన్ 6,500mAh బ్యాటరీ 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రేపు (మే 19) భారత మార్కెట్లో రెండు మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. మోటో G37, మోటో G37 పవర్‌లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్‌లో యూరప్‌లో లాంచ్ అయ్యాయి. ఫోన్ స్పెసిఫికేషన్లు, అంతర్జాతీయ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు.