Motorola G Max Launch : బ్యాటరీ బీస్ట్ వచ్చేసింది.. కొత్త మోటోరోలా G మ్యాక్స్ అదుర్స్.. ధర తెలిస్తే షాక్ అవుతారు!

Motorola G Max Launch : కొత్త మోటోరోలా G మ్యాక్స్ ఫోన్ లాంచ్ అయింది. 7000mAh బ్యాటరీ, 50ఎంపీ సోనీ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..

Motorola G Max Launch

  • కొత్త మోటోరోలా G మ్యాక్స్ ఫోన్ లాంచ్
  • 7000mAh బ్యాటరీ, 50ఎంపీ సోనీ కెమెరా
  • 128GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్

Motorola G Max Launch : మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో కొత్త జి సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్, పాంటోన్, శాటిన్-ఫినిష్ డిజైన్‌తో వస్తుంది. అలాగే, 120Hz డిస్‌ప్లే, ఏఐ-అసిస్టెంట్ ఫొటోగ్రఫీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కొత్త మోటోరోలా ఫోన్ వచ్చే వారం ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ధర, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి.

మోటోరోలా G మాక్స్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా G మ్యాక్స్ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్‌తో అందిస్తుంది. వాటర్ టచ్ టెక్నాలజీ అందిస్తుంది. ఈ ఫోన్ 4nm ప్రాసెస్‌పై స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6GB LPDDR5X ర్యామ్, వర్చువల్ ర్యామ్ బూస్ట్ ద్వారా 18GB వరకు పెంచుకోవచ్చు.

128GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. 33W ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తుంది. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. రెండు ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది.

Read Also : Flipkart Freedom Sale : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంత తగ్గిందంటే?

కెమెరా విషయానికి వస్తే.. :
ఈ మోటోరోలా ఫోన్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో 50MP సోనీ లైటియా, 600 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఆటోఫోకస్ కొరకు స్పెషల్ యాంబియంట్ లైట్ సెన్సార్‌తో 32MP క్వాడ్-పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. అంతేకాదు.. నైట్ విజన్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో మోడ్, అడోబ్ స్కాన్, మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్‌బ్లర్ వంటి ఏఐ-ఆధారిత గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్ టూల్స్‌ కూడా అందిస్తుంది.

ఈ మోటోరోలా ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, MIL-STD-810H సర్టిఫికేషన్, IP64 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో, డ్యూయల్ మైక్రోఫోన్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

భారత్‌లో ధర ఎంతంటే? :
మోటోరోలా G మ్యాక్స్ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ సింగిల్ కాన్ఫిగరేషన్‌లో ధర రూ. 27,999కు లభిస్తుంది. రూ. 1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ పొందవచ్చు. తద్వారా ఫైనల్ ధర రూ. 26,999కి తగ్గింపు పొందవచ్చు. ఆగస్టు 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకానికి రానుంది. పాంటోన్ స్టార్‌గేజర్, పాంటోన్ అలస్కాన్ బ్లూ, పాంటోన్ మలగా అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.