Motorola G77 Power : అద్భుతం.. ఈ మోటోరోలా ఫోన్ మరి తక్కువా? ధర ఎంతో తెలిస్తే కొనుకుండా ఉండలేరు!
Motorola G77 Power : ఫ్లిప్‌కార్ట్ ఈ మోటోరోలా జీ77 ఫోన్ అసలు ధరపై 49శాతం తగ్గింపు అందిస్తోంది. ఇప్పుడు ఈ మోటోరోలా 5జీ ఫోన్ జస్ట్ రూ. ధర రూ. 21,249కే లభిస్తోంది. పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
- Sreehari A
- Updated on- October 19, 2026 / 04:58 PM IST
Motorola G77 Power Price Drop
- ఫ్లిప్‌కార్ట్ ఈ మోటోరోలా ఫోన్ 49శాతం తగ్గింపుతో లభ్యం
- తగ్గింపు తర్వాత మోటోరోలా జీ77 పవర్ ధర రూ. 21,249కే
- 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999
Motorola G77 Power : మోటోరోలా G77 పవర్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్ ఈ మోటోరోలా ఫోన్‌ను అతి చౌకైన ధరకే ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో మోటోరోలా G77 పవర్‌ను తగ్గింపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ, 50MP రియర్ కెమెరా ఉన్నాయి. ఈ డ్యూయల్-కెమెరా సెటప్ డైమెన్సిటీ 6400 చిప్‌తో రన్ అవుతుంది. ఇందులో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మోటోరోలా G77 పవర్ బెస్ట్ డీల్స్‌ను వివరంగా పరిశీలిద్దాం..
ధర తగ్గింపు ఆఫర్ :
మోటోరోలా G77 పవర్ తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ 49శాతం తగ్గింపుతో అందిస్తోంది. తద్వారా ధర రూ.21,249కి తగ్గింది.
బ్యాంక్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు :
మీరు మోటోరోలా G77 పవర్‌ను బ్యాంక్ ఆఫర్ ద్వారా కొంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫోన్ కొనుగోలుపై రూ.2,250 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అంటే అసలు ధర కన్నా రూ.23వేల వరకు తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
మోటోరోలా G77 పవర్ స్పెసిఫికేషన్లు :
మోటో G77 పవర్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. డాల్బీ అట్మోస్ హై-రెస్ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్సెట్తో రన్ అవుతుంది. ఇందులో 8GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ర్యామ్ బూస్ట్ ద్వారా 24GB వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్లో 50MP సోనీ లైటియా 600, ప్రైమరీ కెమెరా 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్లో 7,000mAh బ్యాటరీ ఉంది. 30W టర్బోపవర్ ఛార్జింగ్ 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ SGS-సర్టిఫైడ్ MIL-STD-810H డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది.
