Motorola Razr 70 : మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ వస్తోందోచ్.. లాంచ్ డేట్, కీలక ఫీచర్లు లీక్..!
Motorola Razr 70 : మోటోరోలా రేజర్ 70 ఫోన్ రాబోతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ డేట్, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ధర ఎంత ఉండొచ్చు? ఇంకా ఏయే ఫీచర్లు ఉండొచ్చంటే?
- Sreehari A
- Updated on- April 23, 2026 / 02:05 PM IST
Motorola Razr 70
- మోటోరోలా రేజర్ 70 ఫోల్డబుల్ డిస్‌ప్లే ఎక్స్‌ట్రనల్ స్క్రీన్‌తో రావచ్చు
- రోజువారీ పర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ లైఫ్, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్
- ఏప్రిల్ 29న దాదాపు రూ. 66వేల ధరతో లాంచ్ అయ్యే ఛాన్స్
Motorola Razr 70 : మోటోరోలా అభిమానులకు పండగే.. కొత్త మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. మోటోరోలా రేజర్ 70 అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఫోల్డబుల్ ఫోన్ ఫ్లిప్ డిజైన్, బయటి డిస్‌ప్లే, లోపలి స్క్రీన్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
మోటోరోలా బ్యాటరీ లైఫ్ కూడా రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. స్టైలిష్ ఫోల్డబుల్ కొనాలంటే (Motorola Razr 70) రాబోయే మోటోరోలా రేజర్ 70 అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ మడతబెట్టే ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా రేజర్ 70 స్పెసిఫికేషన్లు (అంచనా) :
మోటోరోలా రేజర్ 70లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ఇన్నర్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. బయటి వైపు, 90Hz రిఫ్రెష్ రేట్ 1,700 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7450X చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB LPDDR5X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 16 మోటోరోలా హలో యూఐతో వస్తుందని అంచనా.
ఈ హ్యాండ్‌సెట్‌లో 4,800mAh బ్యాటరీ ఉండొచ్చు. 30W వైర్డ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. కెమెరా సెగ్మెంట్లో ఈ ఫోన్ డ్యూయల్ 50MP రియర్ కెమెరా సెటప్‌తో పాటు 32MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. IP48 సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
మోటోరోలా రేజర్ 70 కలర్ ఆప్షన్లు (అంచనా) :
మోటో రేజర్ 2026 ఫోన్ గ్రే, గ్రీన్ వైట్ కలర్ వేరియంట్లలో కూడా వస్తుందని అంచనా. కొన్ని లీక్‌లలో ఈ మోటోరోలా ఫోన్ పింక్ వేరియంట్ కూడా ఉంటుందనే పుకార్లు వచ్చాయి.
మోటోరోలా రేజర్ 70 భారత్ లాంచ్ తేదీ, ధర (అంచనా) :
కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మోటో రేజర్ 70 ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని అంచనా. నివేదికల ప్రకారం.. ఈ మోటోరోలా ఫోన్ ధర సుమారు రూ. 66వేలు ఉండవచ్చు. గత ఏడాది మోడల్ కన్నా ధర కొంచెం ఎక్కువ ఉండొచ్చు.
