Motorola Razr 70 Series : మోటోరోలా మాస్ ఎంట్రీ.. కొత్త రేజర్ 70 సిరీస్ ఫోన్లు ఆగయా.. ఫోల్డబుల్ ఫోన్లకి కొత్త కింగ్.. ధరలు వింటే షాక్!
Motorola Razr 70 Series : మోటోరోలా రేజర్ 2026 సిరీస్ అదిరిపోయింది.. కంపెనీ ఫ్లాగ్‌షిప్ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో 3 మోడళ్లు ఉన్నాయి. మోటోరోలా రేజర్ అల్ట్రా 2026, మోటోరోలా రేజర్ ప్లస్ 2026, మోటోరోలా రేజర్ 2026 ఫోన్లు ఉన్నాయి..
- Sreehari A
- Updated on- April 30, 2026 / 08:47 PM IST
Motorola Razr 70 Series
- అద్భుతమైన ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్లు
- 7 కలర్ ఆప్షన్లతో ప్రీమియం ఫీచర్లతో మోటోరోలా రేజర్ 2026
- అతి త్వరలో ప్రపంచ మార్కెట్లలో ఫస్ట్ సేల్ ప్రారంభం
Motorola Razr 70 Series : కొత్త మోటోరోలా ఫోన్లు వచ్చేశాయ్.. ఒకటి కాదు భయ్యా.. ఏకంగా మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. మోటరోలా రేజర్ 2026 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫ్లాగ్‌షిప్ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మోటోరోలా రేజర్ అల్ట్రా 2026, మోటరోలా రేజర్ ప్లస్ 2026, మోటరోలా రేజర్ 2026 అనే 3 మోడళ్లు ఉన్నాయి.
ఈ సిరీస్ రాబోయే నెలల్లో ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో అమ్మకానికి (Motorola Razr 70 Series) అందుబాటులో ఉంటుంది. ఈ లైనప్‌లో మొత్తం 7 విభిన్న పాంటోన్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మోటోరోలా రాజర్ అల్ట్రా 2026 రాజర్ ప్లస్ 2026 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ల ద్వారా రన్ అవుతాయి. అయితే, స్టాండర్డ్ రాజర్ 2026 మోడల్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. అల్ట్రా ప్లస్ మోడల్‌లలో భారీ 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండగా, రాజర్ 2026లో కొద్దిగా చిన్నదిగా 3.6-అంగుళాల బయటి స్క్రీన్ ఉంటుంది.
మోటోరోలా రేజర్ 2026 సిరీస్ ధర, లభ్యత :
మోటోరోలా రేజర్ అల్ట్రా 2026 ధర 1,499.99 డాలర్లు (సుమారుగా రూ. 143,000). ఈ ఫోల్డబుల్ ఫోన్ రాబోయే నెలల్లో యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మోటోరోలా రేజర్ ప్లస్ 2026 రేజర్ 2026 ధరలు వరుసగా 1,099.99 డాలర్లు (సుమారుగా రూ. 105,000) 799.99 డాలర్లు (సుమారుగా రూ. 76,000) ఉంటుంది.
రాబోయే నెలల్లో యూరప్, మధ్యప్రాచ్యం ఆఫ్రికాలో ఈ 2 మోడళ్లు అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. మోటోరోలా రేజర్ 2026 సిరీస్‌లోని రేజర్ ప్లస్ 2026 మోడల్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కూడా అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ రేజర్ 2026 లాటిన్ అమెరికాలో లాంచ్ అవుతుంది. ఈ కొత్త మోటోరోలా రేజర్ 2026 సిరీస్, ఆయా ప్రాంతాలలో మే 14వ తేదీ నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్ కోసం లభ్యమవుతుంది.
మోటోరోలా రేజర్ 2026 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా రేజర్ 2026 సిరీస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లకు 3 ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది.
మోటోరోలా రేజర్ అల్ట్రా 2026 రేజర్ ప్లస్ 2026 ఫోన్‌లలో 165Hz వరకు రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. స్టాండర్డ్ రేజర్ 2026 మోడల్‌లో 3.6-అంగుళాల ఎక్స్‌ట్రనల్ టచ్‌స్క్రీన్ ఉంటుంది.
లోపలి భాగంలో మోటోరోలా రేజర్ అల్ట్రా 2026లో 7-అంగుళాల 10-బిట్ ఎల్టీపీఓ ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ ఫోల్డబుల్ డిస్‌ప్లే అందిస్తుంది. 165Hz వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 22:9 యాస్పెక్ట్ రేషియో 5,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ సపోర్టు ఇస్తుంది.
Read Also : Moto G37 Series : వారెవ్వా.. కొత్త మోటో G37 ఫోన్లు వచ్చేశాయ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర జస్ట్ ఎంతంటే?
మోటోరోలా రేజర్ ప్లస్, రేజర్ బేస్ ఫోన్ 6.9-అంగుళాల 10-బిట్ ఎల్టీపీఓ ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ ఫోల్డబుల్ స్క్రీన్ అందిస్తుంది. 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. ప్లస్ మోడల్ 165Hz వరకు రిఫ్రెష్ రేట్ అందిస్తుండగా, స్టాండర్డ్ మోడల్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
మోటోరోలా రేజర్ అల్ట్రా 2026 ఫ్లాగ్‌షిప్ మోడల్, 4.47GHz టాప్ క్లాక్ స్పీడ్‌తో 3nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ద్వారా రన్ అవుతుంది. ఇందులో అడ్రెనో 830 జీపీయూ, 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మోటోరోలా రేజర్+ 2026, 3GHz క్లాక్ స్పీడ్‌తో 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్ ద్వారా రన్ అవుతుంది.
ఇందులో అడ్రెనో జీపీయూ, 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. చివరగా, మోటోరోలా రేజర్ 2026, 2.6GHz క్లాక్ స్పీడ్‌తో 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7450X చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఇందులో మాలి-G615 MC2 జీపీయూ, 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
కెమెరాల విషయానికొస్తే.. :
మోటోరోలా రేజర్ 2026 సిరీస్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, మాక్రో విజన్ లెన్స్ ఉంటాయి. అల్ట్రా మోడల్‌లో హోల్-పంచ్ డిస్‌ప్లే కటౌట్‌లో మరో 50MP కెమెరా ఉంటుంది. రేజర్ ప్లస్ 2026 రేజర్ 2026 మోడళ్లలో 32MP కెమెరాలు ఉన్నాయి. ఈ 3 మోడళ్లు 1080p/30 ఎఫ్‌పీఎస్ వరకు వీడియోను రికార్డ్ చేయగలవు.
మోటోరోలా రేజర్ అల్ట్రా 2026లో 5,000mAh బ్యాటరీ ఉంది. 68W (వైర్డ్), 30W (వైర్‌లెస్), 5W (వైర్డ్-రివర్స్) ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా రేజర్ ప్లస్ 2026లో 4,500mAh బ్యాటరీ ఉంది. 45W (వైర్డ్), 15W (వైర్‌లెస్), 5W (రివర్స్-వైర్డ్) ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
చివరగా, స్టాండర్డ్ మోడల్‌లో 4,800mAh బ్యాటరీ ఉంది 30W (వైర్డ్) 15W (వైర్‌లెస్) ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
