Netflix Subscription : నెట్‌ఫ్లిక్స్ ఇలా షాకిచ్చిందేంటి? భారీగా పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరలు.. మీ ప్లాన్ ఇదేనా?

Netflix Subscription : మీకు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉందా? అన్ని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు 1 డాలర్ (సుమారు రూ. 95) వరకు ఖరీదైనవిగా మారాయి. ఈ దేశాలలో స్టాండర్డ్, ప్రీమియంతో సహా అన్ని ప్లాన్‌ల ధరలు పెరిగాయి.

Netflix Subscription

  • స్టాండర్డ్, ప్రీమియం, ఎక్స్‌ట్రా ప్రీమియం సహా అన్ని ప్లాన్‌ ధరల పెంపు
  • కెనడా, అర్జెంటీనా, పోర్చుగల్‌ ఎంపిక చేసిన మార్కెట్లలో అమల్లోకి
  • అన్ని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ల ధర సుమారు రూ. 95 పెరిగింది

Netflix Subscription : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ ధరలు భారీగా పెరిగాయి. స్టాండర్డ్, ప్రీమియం, ఎక్స్‌ట్రా ప్రీమియం ప్లాన్‌లతో సహా అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరలు పెంచేసింది. యునైటెడ్ స్టేట్స్‌తో పాటు కెనడా, అర్జెంటీనా, పోర్చుగల్ వంటి ఎంపిక చేసిన మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ప్లాన్లు ఇప్పుడు మరింత ఖరీదైనవిగా మారాయి.

ఈ మార్పు ప్రకారం.. అన్ని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు 1 డాలర్లు (సుమారు రూ. 95) మేర ఖరీదైనవిగా మారాయి. కంపెనీ యాడ్ ఎనేబుల్డ్ ప్లాన్ ధర ఇప్పుడు నెలకు 7.99 డాలర్ల నుంచి 8.99 డాలర్లు (సుమారు రూ. 850)కి పెరిగింది.

అమెరికాలో స్టాండర్డ్ ప్లాన్ ధర ఇప్పుడు నెలకు 17.99 డాలర్ల నుంచి 19.99 డాలర్లకి (సుమారు రూ. 1,800) పెరిగింది. ప్రీమియం ప్లాన్ ధర ఇప్పుడు నెలకు 24.99 డాలర్ల నుంచి 26.99 డాలర్లకి (సుమారు రూ. 2,500) పెరిగింది. కంపెనీ ఎక్స్‌ట్రా మెంబర్ ప్లాన్ ధరలను కూడా పెంచింది.

ఎక్స్‌ట్రా మెంబర్ ప్లాన్‌ల ధరలు కూడా పెరిగాయి. యాడ్స్‌తో ప్లాన్ల ధర ఇప్పుడు 5.99 డాలర్ల నుంచి 6.99 డాలర్లకి (సుమారు రూ. 650) పెరిగింది. ఫ్రీ యాడ్-ఆన్ ధర 8.99 డాలర్ల నుంచి 9.99 డాలర్లకి (సుమారు రూ. 950) పెరిగింది.

Read Also : Vivo T5 Pro : వివో నుంచి కిర్రాక్ ఫోన్ వస్తోంది.. ఈసారి ప్రో మోడల్ రేంజ్ వేరబ్బా.. ఫీచర్లు మాత్రం కేక, ధర ఎంత ఉండొచ్చంటే?

కంపెనీ కంటెంట్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో నెట్‌ఫ్లిక్స్ ఈ పెంపును ప్రకటించింది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు లైవ్ ఈవెంట్‌లు, వీడియో పాడ్‌కాస్ట్‌లు మొదలైన వాటిలో కూడా పెట్టుబడులు పెడుతోంది. అంతకుముందు, నెట్‌ఫ్లిక్స్ జనవరి 2025లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను పెంచింది.

నెట్‌ఫ్లిక్స్ జనవరి ఆదాయ నివేదికలో 2025లో కంటెంట్‌పై ఖర్చు చేసిన 18 బిలియన్ డాలర్ల నుంచి 2026లో 20 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. 2026లో మొత్తం ఆదాయం 50.7 బిలియన్ డాలర్ల నుంచి 51.7 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సంస్థ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్, స్ట్రీమింగ్ సర్వీస్ HBO Max కూడా కొనాలని చూస్తోంది.

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ ధరలు పెంచిందా? :
నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ ధరలను పెంచలేదు. మార్చి 2026 నాటికి యునైటెడ్ స్టేట్స్, పోర్చుగల్, అర్జెంటీనా, కెనడాలోని ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే ప్లాన్ల ధరలు పెరిగాయి. ఈ ప్లాన్ల ధరలతో కూడిన నెలవారీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇలా ఉన్నాయి.

  • మొబైల్ ప్లాన్ కోసం నెలకు రూ. 149
  • బేసిక్ ప్లాన్‌కు నెలకు రూ. 199
  • స్టాండర్డ్ ప్లాన్‌కు నెలకు రూ. 499
  • ప్రీమియం ప్లాన్‌కు నెలకు రూ. 649

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు :
భారత మార్కెట్లో మొబైల్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ అన్ లిమిటెడ్ యాడ్ ఫ్రీ సినిమాలు, టీవీ షోలు, గేమ్‌లను అందిస్తుంది. అయితే, ఒకేసారి ఒక ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే 480p క్వాలిటీలో చూడొచ్చు. మొబైల్ ప్లాన్ అందించే వాటికి అదనంగా, బేసిక్ ప్లాన్ 720p క్వాలిటీని అందిస్తుంది. బేసిక్ ప్లాన్‌తో లభించే దానికంటే స్టాండర్డ్ ప్లాన్ ఒకేసారి రెండు డివైజ్‌లకు 1080p సపోర్ట్‌ అందిస్తుంది. రెండు డివైజ్‌లలో ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే, ప్రీమియం ప్లాన్ ఒకేసారి 4 డివైజ్‌లలో చూసేందుకు సపోర్టు ఇస్తుంది. 4K (అల్ట్రా HD) + HDR, ఒకేసారి 6 డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ స్పేషియల్ ఆడియోను కూడా అందిస్తుంది.