New IRCTC Beta Website : ఇక టికెట్ బుకింగ్‌లో టెన్షన్ లేదు.. IRCTC కొత్త వెబ్‌సైట్‌లో ఈ 5 సూపర్ ఫీచర్లు మిస్ అవ్వకండి!

New IRCTC Beta Website : ఐఆర్‌సీటీసీ కొత్త బీటా వెబ్‌సైట్ వచ్చేసింది. టికెట్ బుకింగ్ ఇక సూపర్ ఫాస్ట్.. రైల్వే ప్రయాణికులు ఈ 5 కొత్త ఫీచర్లు ఏంటో తప్పక తెలుసుకోండి.

New IRCTC Beta Website

  • రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్
  • ఐఆర్‌సీటీసీ కొత్త బీటా వెబ్ సైట్ వచ్చేసింది
  • 2 శాతానికి పైగా బుకింగ్స్, 5 శాతానికి పైగా రిజర్వేషన్లు

New IRCTC Beta Website : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్ చేయడం ఇకపై చాలా ఈజీ.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త బీటా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 15, 2026 నుంచే ఈ బీటా వెర్షన్ ప్రారంభం కాగా ప్లాట్‌ఫామ్‌లో అడ్వాన్స్ డిజైన్‌తో పాటు యూజర్ల ఎక్స్ పీరియన్స్ కోసం అనేక కీలక మార్పులు చేసింది.

ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్‌ను అత్యంత వేగవంతం చేయడంపై ఐఆర్‌సీటీసీ (New IRCTC Beta Website) ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త బీటా వెబ్‌సైట్‌లో తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 3 నిమిషాల్లో పూర్తయ్యే రిజర్వేషన్లు 5 శాతానికి పైగా పెరిగాయని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

అలాగే 5 నిమిషాల్లో జరిగే బుకింగ్‌లు సుమారు 3 శాతం, 30 నిమిషాల్లో పూర్తయ్యే బుకింగ్‌లు 2 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపింది. తద్వారా రద్దీ సమయంలో కూడా టికెట్ పొందే అవకాశం మరింత పెరగనుంది.

Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. 3శాతం కాదు.. 6శాతం ఇంక్రిమెంట్? కేంద్ర ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పు!

బీటా వెబ్‌సైట్‌ కొత్త లుక్ అదిరింది :
అందులోనూ ఈ బీటా వెబ్‌సైట్‌ కొత్త లుక్ పూర్తిగా యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ప్రత్యేకించి రైళ్ల కోసం సెర్చ్ చేయడం, సీట్లు ఎన్ని ఉన్నాయో చూడడం, టికెట్ బుక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు క్యాప్చాల సంఖ్య, అవసరం లేని పాప్-అప్ మెసేజ్ కూడా తగ్గించారు.

మరో కీలక ఫీచర్ ఏమిటంటే.. స్లీపర్, 3ఏసీ, 2ఏసీ వంటి వివిధ క్లాసు సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై కంపేర్ చేసి చూడొచ్చు. తద్వారా వేర్వేరు పేజీలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉన్న చోటే మీ ఆప్షన్లను ఈజీగా ఎంచుకోవచ్చు.

ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ బీటా వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేస్తామని ఐఆర్‌సీటీసీ తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 89.84 శాతం రైల్వే టికెట్ బుకింగ్స్ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో లభిస్తున్నాయి. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన బుకింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.