Unlock Amazon Account : మీ అమెజాన్ అకౌంట్ లాక్ అయిందా? పాస్‌వర్డ్ లేకుండానే ఇలా ఈజీగా అన్‌లాక్ చేసుకోవచ్చు తెలుసా?

Unlock Amazon Account : మీ అమెజాన్ అకౌంట్ లాక్ అయిందా? అమెజాన్ పాస్‌కీలతో కొత్త పాస్‌వర్డ్‌లెస్ లాగిన్‌ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇకపై యూజర్లు ఫేస్, ఫింగర్‌ఫ్రింట్ లేదా పిన్‌తో సేఫ్‌గా అకౌంట్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

Unlock Amazon Account : మీ అమెజాన్ అకౌంట్ లాక్ అయిందా? పాస్‌వర్డ్ లేకుండానే ఇలా ఈజీగా అన్‌లాక్ చేసుకోవచ్చు తెలుసా?

how you can unlock your Amazon account with your face

Unlock Amazon Account : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google Passkeys) తర్వాత, ఇప్పుడు ఇ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon) కూడా అదే తరహాలో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కొత్తగా అమెజాన్ యూజర్ల కోసం పాస్‌కీ సపోర్టును తీసుకొచ్చింది. యూజర్లకు వారి బ్రౌజర్‌లు, మొబైల్ షాపింగ్ యాప్‌లలో పాస్‌కీ సపోర్టును అందిస్తోంది.

ఈ కొత్త పాస్‌వర్డ్‌లెస్ సిస్టమ్ ద్వారా యూజర్లను వారి అమెజాన్ అకౌంట్లలో సైన్ ఇన్ చేయడానికి మరింత సౌకర్యవంతమైన సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. అమెజాన్ పాస్‌కీలతో (Amazon Passkeys) వినియోగదారులు తమ డివైజ్‌లను అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే అదే ఫేస్‌లాక్, ఫింగర్‌ఫ్రింట్ (Fingerprint) లేదా పిన్‌ (PIN)ను సులభంగా ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది.

Read Also : Amazon Sale on Laptops : అమెజాన్ సేల్.. ఈ టాప్ 5 ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

ఇకపై పాస్‌వర్డులతో పనిలేదు : 

సాంప్రదాయ పాస్‌వర్డ్‌లతో పనిలేకుండా యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసేందుకు పాస్‌కీలను అమెజాన్ అందిస్తోంది. ఎందుకంటే.. ఈ పాస్‌కీలను సులభంగా రాయలేం లేదా ఊహించలేం. సైబర్ మోసగాళ్లు కూడా వీటిని క్రాక్ చేయడం కుదరదు. పాస్‌కీ ద్వారా వినియోగదారులు తమ డివైజ్ అన్‌లాక్ చేయాలి.

డివైజ్ ఓనర్‌షిప్, యాక్సెస్ సామర్థ్యానికి ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. పాస్‌కీలతో, ఇకపై ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. పేర్లు లేదా పుట్టినరోజులు వంటి సులభంగా ఊహించగలిగే ఐడెంటిఫైయర్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

how you can unlock your Amazon account with your face

Unlock Amazon Account

అకౌంట్ అన్‌లాక్ చేయాలంటే? :
అందుకు బదులుగా, కస్టమర్‌లు తమ డివైజ్‌లను అన్‌లాక్ చేసే పద్ధతిలో యాప్‌లు, వెబ్‌సైట్‌లకు లాగిన్ చేయడానికి పాస్‌కీలను ఉపయోగించవచ్చు. ఫింగర్‌ఫ్రింట్, ఫేస్ రికగ్నైజేషన్ లేదా లాక్ స్క్రీన్ పిన్ ద్వారా కూడా అకౌంట్ అన్‌లాక్ చేసుకోవచ్చు. ఇంకా, సాంప్రదాయ పాస్‌వర్డ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా వన్-టైమ్ కోడ్‌లతో పోలిస్తే.. పాస్‌కీలు ఫిషింగ్ అటాక్స్ తక్కువ అవకాశం కలిగి ఉంటాయి. తద్వారా అమెజాన్ కస్టమర్‌లకు పూర్తి భద్రతను అందిస్తుంది.

అమెజాన్ యూజర్లు ఇప్పుడు బ్రౌజర్‌లు, iOS అమెజాన్ షాపింగ్ యాప్ ద్వారా తమ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి పాస్‌కీలను ఉపయోగించవచ్చు. ఇంతలో, ఆండ్రాయిడ్ అమెజాన్ షాపింగ్ యాప్‌ (Amazon Shopping App)కు పాస్‌కీ సపోర్ట్ కూడా అందుబాటులో ఉందని, త్వరలో అందరి యూజర్లకు అందుబాటులోకి వస్తుందని అమెజాన్ హామీ ఇచ్చింది. అమెజాన్‌లో పాస్‌కీలను ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో పాస్‌కీలను ఎలా ఉపయోగించాలంటే? :
* మీ అమెజాన్ అకౌంట్‌కు వెళ్లి (Your Account) ఎంచుకోండి.
* లాగిన్ & సెక్యూరిటీ (Login & Security)ని ఎంచుకోండి.
* Passkeys పక్కనే ఉన్న Setup ఎంచుకోండి.
* ఆ తర్వాతి దశల వారీ సూచనలను ఫాలో చేయండి.

మీరు మీ అకౌంట్ Passkey యాడ్ చేసిన తర్వాత, మీ ఐడెంటిటీని నిర్ధారించడానికి మీ లాక్ స్క్రీన్ PIN లేదా బయోమెట్రిక్‌లను ఉపయోగించి సపోర్టు ఉన్న డివైజ్‌లు లేదా బ్రౌజర్‌లలో పాస్‌కీతో సైన్ ఇన్ చేయవచ్చు.

Read Also : Amazon Festival Sale : అమెజాన్‌లో స్పెషల్ ‘ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్’ సేల్.. టాప్ బ్రాండ్‌ల ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై అదిరే డీల్స్..!