Google New Passkeys : గూగుల్‌లో కొత్త పాస్‌కీ ఫీచర్.. మీ ఆండ్రాయిడ్, క్రోమ్‌లో పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ కావొచ్చు..!
Google New Way : గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై మీ గూగుల్ అకౌంట్లను పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ కావొచ్చు. యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు Google Android డివైజ్‌లు Chrome కోసం కొత్త పాస్‌కీ (PassKey)ఫీచర్‌ను రిలీజ్ చేసింది.

Google unveils new way to login without passwords on Android and Chrome
Google New Way : గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై మీ గూగుల్ అకౌంట్లను పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ కావొచ్చు. యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు Google Android డివైజ్‌లు Chrome కోసం కొత్త పాస్‌కీ (PassKey)ఫీచర్‌ను రిలీజ్ చేసింది. మీ పాస్‌వర్డ్‌ని ఉపయోగించకుండా ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ చేసేందుకు పిన్ (PIN)లు లేదా బయోమెట్రిక్ (BioMetric) ఉపయోగించవచ్చు. యూజర్లు తమ ఐడెంటిటీ అథెంటికేషన్ కోసం ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
ట్రేడేషనల్ టూ-ఫ్యాక్టర్ మెథడ్ కన్నా Google యూజర్లకు సురక్షితమైన ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ ఏడాది మేలో మైక్రోసాఫ్ట్ (Microsoft), ఆపిల్ (Apple), గూగుల్ (Google) వంటి టెక్ దిగ్గజాలు యూజర్లకు సాధారణ పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ (Sign-In) ఆప్షన్ ప్రకటించాయి. దీనిని వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం (W3C), FIDO అలయన్స్ డెవలప్ చేసిన “Passkeys” అని పిలుస్తారు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలపర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. Google ఈ ఏడాది చివరిలో సాధారణ యూజర్లకు Passkeys ఫీచర్‌ను అందించాలని యోచిస్తోంది.

Google unveils new way to login without passwords on Android and Chrome
Google పాస్‌వర్డ్ మేనేజర్‌కి బ్యాకప్ అందిస్తుంది. సింకరింగ్ సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. Android డివైజ్‌ల్లో Passkeys క్రియేట్ చేసుకోవచ్చు. క్లౌడ్ సర్వీసుకు బ్యాకప్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాత డివైజ్ నుంచి డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా వినియోగదారు కొత్త Android డివైజ్ సెటప్ చేసుకోవచ్చు. Google ప్రకారం.. ఇప్పటికే ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ Keys సురక్షితంగా కొత్త డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. డెవలపర్‌లు ఇప్పుడు Android యాప్స్ కోసం కొత్త అథెంటికేషన్ టెస్టింగ్ కోసం Google Play సర్వీసుల బీటాలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
WebAuthn API ద్వారా Android ఇతర సపోర్టు ఉన్న ప్లాట్‌ఫారమ్‌లలో Chromeని ఉపయోగించే ఎండ్ యూజర్ల కోసం సైట్‌లలో Passkey సపోర్టును కూడా రూపొందించవచ్చు. రాబోయే వారాలు లేదా నెలల్లో, Google లోకల్ Android యాప్‌ల కోసం APIని కూడా రిలీజ్ చేస్తుంది. మొబైల్ అప్లికేషన్‌లను లాగిన్ చేసేందుకు వెబ్ PassKey ఉపయోగించేందుకు అనుమతిస్తుంది. మీరు Google అకౌంట్ ఎంచుకోవడం ద్వారా మీ Android ఫోన్‌లో PassKeyని సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రిజిస్టర్ అయిన ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ (Face Unlock)ని ఉపయోగించి మీ ఐడెంటిటీని అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు.

Google unveils new way to login without passwords on Android and Chrome
PassKey అనేది cryptographic ప్రైవేట్ కీ అని గూగుల్ చెబుతోంది. ఈ ప్రైవేట్ Key ల్యాప్‌టాప్‌లు లేదా మొబైల్ ఫోన్‌ల వంటి యూజర్ల సొంత డివైజ్‌లలో మాత్రమే ఉంటుంది. PassKey క్రియేట్ చేసినప్పుడు దాని సంబంధిత Public Key మాత్రమే ఆన్‌లైన్ సర్వీసు ద్వారా Storage అవుతుంది. Login సమయంలో, Private Key నుంచి సంతకాన్ని ధృవీకరించడానికి Service Public Key ఉపయోగిస్తుంది. ఇది యూజర్ల డివైజ్‌ల్లో ఒకదాని నుంచి మాత్రమే వస్తుంది. ఇందుకోసం యూజర్లు వారి డివైజ్ లేదా క్రెడెన్షియల్ స్టోర్‌ని అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Google Chrome : గూగుల్ క్రోమ్ డేటా ట్రాకింగ్.. మీ డివైజ్‌లను ట్రాక్ చేయకుండా ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!