Google Chrome : గూగుల్ క్రోమ్ డేటా ట్రాకింగ్.. మీ డివైజ్‌లను ట్రాక్ చేయకుండా ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

Google Chrome : గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేయాలంటే అత్యధిక సంఖ్యలో వినియోగించే బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome). ఈ క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్‌లో తమకు అవసరమైన డేటాను సర్ఫ్ చేస్తుంటారు వినియోగదారులు.

Google Chrome : గూగుల్ క్రోమ్ డేటా ట్రాకింగ్.. మీ డివైజ్‌లను ట్రాక్ చేయకుండా ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

Google Chrome's data tracking _ Here's how to send ‘Do not track' request

Google Chrome : గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేయాలంటే అత్యధిక సంఖ్యలో వినియోగించే బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome). ఈ క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్‌లో తమకు అవసరమైన డేటాను సర్ఫ్ చేస్తుంటారు వినియోగదారులు. అయితే Google Chromeకి చెక్ ఇన్ చేసిన ప్రతిసారీ, యూజర్ల సున్నితమైన డేటాను ఆయా వెబ్‌సైట్లు ట్రాక్ చేస్తుంటాయి.

వారి డివైజ్‌లను ట్రాక్ చేయడం వివిధ వెబ్‌సైట్‌లకు బ్రౌజర్ ట్రాకింగ్ కామన్.. అయితే ఈ ఫీచర్ బ్రౌజర్లలో డిఫాల్ట్ సెట్టింగ్ ఆన్ అయి ఉంటుంది. దాంతో అనేక వెబ్‌సైట్‌లు వినియోగదారుల డివైజ్‌లను ఈజీగా ట్రాక్ చేయగలవు. వారి డేటాను కూడా యాక్సెస్ చేయగలవు.

Google Chrome's data tracking _ Here's how to send ‘Do not track' request

Google Chrome’s data tracking _ Here’s how to send ‘Do not track’ request

అయితే.. వెబ్‌సైట్ ట్రాకింగ్ ద్వారా వినియోగదారు డేటాకు ఏమౌతుందోననే ఆందోళన కలగకమానదు. ఉదాహరణకు.. ‘ Do Not Track’ Request పంపిన తర్వాత.. అనేక వెబ్‌సైట్‌లు సెక్యూరిటీ పెంచడానికి వారి వెబ్‌సైట్‌లలో కంటెంట్, సర్వీసులు, యాడ్స్, సిఫార్సులను అందించేందుకు వీలుగా రిపోర్టింగ్ గణాంకాలను వినియోగదారు బ్రౌజింగ్ డేటాను ఉపయోగించడం కొనసాగిస్తాయి.

Googleతో సహా చాలా వెబ్‌సైట్‌లు, వెబ్ సర్వీసులను ట్రాక్ చేయవద్దు రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది అప్పుడు ట్రాకింగ్ చేయదని Google బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. అయినప్పటికీ, ఈ హైడ్ ట్రాకర్‌లను ఆపడానికి వినియోగదారు బ్రౌజింగ్ డేటాను సేకరించవద్దని లేదా ట్రాక్ చేయవద్దని కోరుతూ వినియోగదారులు వెబ్‌సైట్‌లకు రిక్వెస్ట్ పంపవచ్చు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

మీ డెస్క్‌టాప్ నుంచి ‘Do not track’ రిక్వెస్ట్ పంపవచ్చు.
* మీ కంప్యూటర్‌లో Chromeని ఓపెన్ చేయండి.
* త్రి డాట్స్ మెను ఆప్షన్‌పై Click చేయండి.
* డ్రాప్-డౌన్ మెను నుంచి సెట్టింగ్‌ల ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్‌ల కింద Cookies, ఇతర సైట్ డేటా బటన్‌పై క్లిక్ చేయండి.
* మీ బ్రౌజింగ్ ట్రాఫిక్‌తో ‘Do Not Track ‘ రిక్వెస్ట్ పంపడం కోసం Toggle టర్న్ ఆన్ చేయండి.

Google Chrome's data tracking _ Here's how to send ‘Do not track' request

Google Chrome’s data tracking _ Here’s how to send ‘Do not track’ request

Android డివైజ్ నుంచి ‘Do Not Track’ని పంపవచ్చు
* Android డివైజ్ నుంచి Chrome యాప్ ఓపెన్ చేయండి.
* స్క్రీన్ రైట్ కార్నర్‌లో అందుబాటులో ఉన్న త్రి డాట్స్ మెనుని Tap చేయండి.
* Settings వెళ్లండి.
* బేసిక్స్ ట్యాబ్ కింద.. Privacy, Security బటన్‌ను Tap చేయండి.
* ‘Do not track’ ఆప్షన్‌పై Tap చేయండి. Settings ఆన్ చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Lava Blaze 5G : భారత్‌లో సరసమైన ధరకే లావా బ్లేజ్ 5G ఫోన్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. ఇప్పుడే కొనేసుకోండి!