Nothing Phone 3 : పండగ చేస్కోండి.. రూ. 85వేల నథింగ్ ఫోన్ జస్ట్ రూ.49వేలకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు!

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 అద్భుతమైన తగ్గింపుతో లభ్యమవుతోంది. ఇలా కొన్నారంటే నథింగ్ ఫోన్ రూ. 35వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 3 ( Image Credit AI )

  • నథింగ్ ఫోన్ 3 మోడల్ 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే
  • 5500mAh బ్యాటరీ, కంపెనీ మూడు 50MP కెమెరాలు
  • ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో రూ. 2,500 తగ్గింపు

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన డిస్కౌంట్.. ఈ నథింగ్ ఫోన్‌లో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. కంపెనీ ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నథింగ్ ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం (Nothing Phone 3) చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నథింగ్ ఫోన్ 41శాతం తగ్గింపుతో లభిస్తోంది. 5500mAh బ్యాటరీ ఉంది. నథింగ్ ఫోన్ 3పై బెస్ట్ ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

నథింగ్ ఫోన్ 3 ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు నథింగ్ ఫోన్ 3 లభిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 84,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం రూ. 49,999కే లభిస్తోంది. లాంచ్ తర్వాత ఫస్ట్ టైమ్ భారీగా తగ్గింది. ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.35వేలు డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తోంది. కంపెనీ బ్యాంక్ ఆఫర్లను కూడా ఆఫర్ చేస్తోంది.

Read Also : Vi Chepest Plan : Vi చీపెస్ట్ ప్లాన్..! ఒక్క రీచార్జ్‌తో 365 రోజులు ఎంజాయ్! 30GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్!

నథింగ్ ఫోన్ 3 బ్యాంక్ డిస్కౌంట్ :
నథింగ్ ఫోన్ 3 కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 2,500 తగ్గింపు లభిస్తుంది. ఈ నథింగ్ ఫోన్‌ రూ. 37,500 వరకు తక్కువకు కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఈ నథింగ్ ఫోన్ ధర రూ. 47,499కి తగ్గుతుంది.

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3లో 1260×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ OS 3.5పై రన్ అవుతుంది. నథింగ్ సంస్థ ఫోన్ 3లో 5,500mAh బ్యాటరీని అందించింది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

నథింగ్ ఫోన్ 3 కెమెరా సెటప్‌లో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 8.99mm మందంతో పాటు 218 గ్రాముల బరువుతో వస్తుంది.