Nothing Phones : నథింగ్ నుంచి 2 కొత్త ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర జస్ట్ ఎంతంటే?

Nothing Phones : నథింగ్ ఫోన్ (4b) 6.77-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,344 పిక్సెల్స్) శాంసంగ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,000Hz ఇన్‌స్టంట్ శాంప్లింగ్ రేట్ 2,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్స్ ఉన్నాయి.

  • Published on- September 28, 2026 / 08:08 PM IST

Nothing Phone 4a and Phone 4b

  • స్మార్ట్‌ఫోన్ల కొత్త వేరియంట్లలో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 4.1 ఆధారిత నథింగ్ ఓఎస్16పై రన్ అవుతాయి
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 50MP మెయిన్ కెమెరా ఆప్షన్ అందిస్తుంది

Nothing Phones : నథింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. నథింగ్ నుంచి భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి.. కొత్త బేస్ వేరియంట్లలో నథింగ్ ఫోన్ (4a), నథింగ్ ఫోన్ (4b) మోడళ్లు ఉన్నాయి. ఇందులో ఈ కొత్త వేరియంట్‌లలో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి.

అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పు లేదు. నథింగ్ ఫోన్ (4a) కొత్త బేస్ వేరియంట్ 6GB + 128GB ధర రూ. 39,999 కాగా, నథింగ్ ఫోన్ (4b) 6GB + 128GB వేరియంట్ ధర రూ. 35,999గా ఉంది.

నథింగ్ ఫోన్ (4a) 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో కూడా (Nothing Phones) లభిస్తోంది. నథింగ్ ఫోన్ (4b) మోడల్ 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.

నథింగ్ ఫోన్ (4a) ఫోన్ (4b) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ 4.1పై రన్ అవుతాయి. నథింగ్ ఫోన్ (4a)లో 6.78-అంగుళాల (1,224 x 2,720 పిక్సెల్స్) ఎల్టీపీఎస్ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. దీనికి 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ 2,160Hz PWM డిమ్మింగ్ రేట్ ఉన్నాయి. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

Read Also : Lava Virat Curve 5G : పండగ చేస్కోండి.. లావా విరాట్ కర్వ్ 5G ఫస్ట్ సేల్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. నథింగ్ ఫోన్ (4a) ఫోన్ 5,400mAh బ్యాటరీతో రన్ అవుతుంది.

నథింగ్ ఫోన్ (4b)లో 6.77-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,344 పిక్సెల్స్) శాంసంగ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,000Hz ఇన్‌స్టంట్ శాంప్లింగ్ రేట్ 2,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్స్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ అడ్రినో 810 జీపీయూ ద్వారా రన్ అవుతుంది.

నథింగ్ ఫోన్ (4b) డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 6,000mAh బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.