×
Ad

Nothing Phone 4a Series : కిర్రాక్ ఫోన్లు భయ్యా.. నథింగ్ ఫోన్ 4a సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ఈ నెల 13 నుంచే ఫస్ట్ సేల్..!

Nothing Phone 4a Series : నథింగ్ ఫోన్ 4ఎ సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ నథింగ్ ఫోన్ 4ఎ, ప్రో సిరీస్ లాంచ్ కాగా, మార్చి 13 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Nothing Phone 4a Series

  • నథింగ్ ఫోన్ 4a 6.78-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్, 70x జూమ్‌తో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌
  • నథింగ్ ఫోన్ 4a ప్రోలో 6.83-అంగుళాల 144Hz అమోల్డ్ ప్యానెల్
  • 140x అల్ట్రా జూమ్‌తో 50MP సోనీ LYT700C మెయిన్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 16, నథింగ్ OS 4.1 రన్, 50W ఛార్జింగ్‌తో 5,400mAh బ్యాటరీ ప్యాక్
  • మార్చి 13 నుండి ఫస్ట్ సేల్ ప్రారంభం

Nothing Phone 4a Series : నథింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. భారత మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 4a సిరీస్‌ వచ్చేసింది. కొత్తగా లాంచ్ అయిన లైనప్‌లో నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 4a ప్రో ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో డిజైన్, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, కెమెరా అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

ఈ రెండు ఫోన్లలో ట్రిపుల్ కెమెరా సెటప్, బ్రాండ్ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ అప్‌గ్రేడ్ గ్లిఫ్ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ నథింగ్ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్‌ ఉంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతాయి. భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 4a ప్రో ధర, స్పెషిఫికేషన్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.

నథింగ్ ఫోన్ 4a స్పెషిఫికేషన్లు :

నథింగ్ ఫోన్ 4a మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఎస్ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 4,500 నిట్‌ల వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ నథింగ్ ఫోన్ LPDDR4X ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4, 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1తో వస్తుంది. ఈ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,400mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

నథింగ్ ఫోన్ IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా నథింగ్ OS 4.1పై రన్ అవుతుంది. 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకుంటుంది. నోటిఫికేషన్‌లు, ఇంటరాక్టివ్ లైటింగ్ ఎఫెక్ట్‌ల కోసం 63 మినీ-ఎల్ఈడీలతో నథింగ్ సిగ్నేచర్ గ్లిఫ్ బార్‌ కూడా ఉంది.

ఈ వివో ఫోన్ OIS, EISతో 50MP శాంసంగ్ GN9 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌, 3.5x ఆప్టికల్ జూమ్, 70x వరకు అల్ట్రా జూమ్‌, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

నథింగ్ ఫోన్ 4a ప్రో స్పెషిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 4a ప్రో మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ నథింగ్ ఫోన్ LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 చిప్‌సెట్‌ అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 16 ఆధారంగా నథింగ్ OS 4.1పై రన్ అవుతుంది. 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5400mAh బ్యాటరీతో వస్తుంది. 7.95mm స్లిమ్ ప్రొఫైల్, IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ అందిస్తుంది.

Read Also : Vivo V60 5G : వారెవ్వా.. వండర్‌ఫుల్ ఆఫర్.. వివో V60 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ నథింగ్ ఫోన్ 50MP సోనీ LYT700C OIS మెయిన్ కెమెరా, 140x వరకు అల్ట్రా జూమ్‌తో 50MP 3.5x OIS టెలిఫోటో లెన్స్, 8MP సోనీ అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అల్ట్రా XDR ఫొటోలు, 4K అల్ట్రా XDR వీడియో కోసం ట్రూలెన్స్ ఇంజిన్ 4 సపోర్టుతో వస్తుంది. నోటిఫికేషన్లు, విజువల్ ఇంటరాక్షన్‌ల కోసం నథింగ్ ఫోన్ 137 మినీ-LEDలతో గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇంటర్‌ఫేస్‌ కూడా అందిస్తుంది.

భారత్‌లో నథింగ్ ఫోన్ 4a సిరీస్ ధర, ఆఫర్లు :

నథింగ్ ఫోన్ 4a బేస్ 8GB + 128GB ధర రూ.31,999 కాగా, 8GB, 256GB వేరియంట్ ధర రూ.34,999, టాప్-ఎండ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ.37,999, నథింగ్ ఫోన్ 4a ప్రో బేస్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ.42,999, 12GB, 256GB వేరియంట్ ధర రూ.45,999కు పొందవచ్చు. ఈ నథింగ్ ఫోన్ మార్చి 13 నుంచి అమ్మకానికి వస్తుంది.

నథింగ్ ఫోన్ 4aపై కస్టమర్లు రూ.3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. నథింగ్ ఫోన్ 4a ప్రో కొనుగోలుపై రూ.4వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఫోన్ 4aపై రూ.4వేల వరకు, 4a ప్రో పై రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో నథింగ్ ఫోన్ 4aపై రూ.4వేలు, ఫోన్ 4a ప్రోపై రూ.5వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. ఈ నథింగ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, క్రోమాతో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.