Nothing Phone 4a Series
Nothing Phone 4a Series : నథింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో నథింగ్ ఫోన్ 4a సిరీస్ రాబోతుంది. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి. నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 4a ప్రో రెండు ఫోన్లు అద్భుతంగా ఉన్నాయి. లీకులను పరిశీలిస్తే.. వచ్చే నెల ప్రారంభంలోనే నథింగ్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
కంపెనీ ఈ ఏడాది ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు రిలీజ్ చేసే అవకాశం లేన్నట్టు కనిపిస్తోంది, కానీ, సీఈఓ కార్ల్ పీ ఇంతకుముందు కొత్త మిడ్-రేంజ్ ఫోన్లలో నథింగ్ ఫోన్ 3a లైనప్‌పై అప్‌గ్రేడ్‌లతో వస్తాయని సూచించారు. నథింగ్ ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. లీక్‌లు, పుకార్ల ఆధారంగా నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 4a ప్రోకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 4a ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
నథింగ్ ప్రో వేరియంట్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. హుడ్ కింద, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
బ్యాటరీ కెపాసిటీ దాదాపు 5,080mAh ఉంటుందని, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఉంటుందని అంచనా. కెమెరాల విషయానికి వస్తే.. ట్రిపుల్ 50MP రియర్ సెటప్ ఉండొచ్చనని లీక్‌లు సూచిస్తున్నాయి. 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు.
నథింగ్ స్టాండర్డ్ ఫోన్ 4a అదే 6.82-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. కానీ, కొంచెం తక్కువ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ నథింగ్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు.
ఈ నథింగ్ మోడల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా 64MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ నథింగ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో వస్తుంది.
నథింగ్ ఫోన్ 4a, 4ఎ ప్రో లాంచ్ తేదీ, ధర (అంచనా) :
పుకార్ల ప్రకారం.. నథింగ్ ఫోన్ 4a సిరీస్ మార్చి 5న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. నథింగ్ ఫోన్ 4a దాదాపు రూ.31,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అయితే, నథింగ్ ఫోన్ 4a ప్రో ధర దాదాపు రూ.41,999 వరకు ఉండవచ్చు.