Nothing Phone 4a Pro : ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ. 50వేల నథింగ్ 5G ఫోన్ జస్ట్ రూ. 40,374కే..!
Nothing Phone 4a Pro : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (4a) ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ధర రూ. 40,374కు తగ్గింది. ఈ 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. పూర్తి ఆఫర్ వివరాలివే..
- Sreehari A
- Published on- May 28, 2026 / 07:17 PM IST
Nothing Phone 4a Pro
- నథింగ్ ఫోన్ 4ఎ ప్రో ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది
- ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40వేల లోపు కొత్త 5జీ ఫోన్ మీ సొంతం
- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 2,500 వరకు తగ్గింపు
Nothing Phone 4a Pro : నథింగ్ ఫోన్ లవర్స్ డోంట్ మిస్.. మీరు రూ.40వేల లోపు కొత్త 5జీ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో నథింగ్ ప్రో ఫోన్ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా తక్కువ ధరకే నథింగ్ ఫోన్ (4a) ప్రో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మీరు ఈ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 4ఎ ప్రో భారీ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇంటర్‌ఫేస్‌తో (Nothing Phone 4a Pro) వస్తుంది. ఈ గ్లిఫ్ 137 మినీ-ఎల్ఈడీలతో వస్తుంది. 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లేలో బ్యాటరీ, టైమర్, డిజిటల్ క్లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 4ఎ మోడల్ ఇతర ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Read Also : WhatsApp Username : వావ్.. వాట్సాప్‌లో కొత్త ‘యూజర్ నేమ్’ ఫీచర్.. మీ ఫోన్ నెంబర్ ఇలా దాచేయండి!
నథింగ్ ఫోన్ (4a) ప్రో ధర, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నథింగ్ ఫోన్ ధర రూ. 49,999 కాగా, ప్రస్తుతం ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఈ ఫోన్‌ను కేవలం రూ. 44,999కే ఆఫర్ చేస్తోంది. బ్యాంకు ఆఫర్లతో నథింగ్ ఫోన్ మరింత తగ్గించుకోవచ్చు.
బ్యాంకు ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 2,500 వరకు తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ. 2,250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా రూ. 4,625 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ నథింగ్ ఫోన్ ధర కేవలం రూ. 40,374కు తగ్గింది.
నథింగ్ ఫోన్ (4a) ప్రో కీలక ఫీచర్లు :
ఈ ఫోన్ ఫీచర్లలో నథింగ్ ఫోన్ (4a) ప్రో ఒకటి. ఇది ప్రీమియం మిడ్-రేంజ్ 5జీ ఫోన్. 6.83-అంగుళాల 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5400mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో స్పెషల్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంది. 140x జూమ్‌తో పవర్‌ఫుల్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి.
