Nothing Phone 4a Pro : అదిరే ఆఫర్.. కొత్త నథింగ్ ఫోన్ 4a ప్రో భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Nothing Phone 4a Pro : నథింగ్ ఫోన్ 4ఎ ప్రో అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఇలా కొన్నారంటే రూ. 8,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Nothing Phone 4a Pro

  • అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు కస్టమర్లు అదనంగా రూ. 1,435 తగ్గింపు
  • పాత ఫోన్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 22,500 వరకు తగ్గింపు
  • 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ 5,400mAh బ్యాటరీ

Nothing Phone 4a Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? నథింగ్ ఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. అసలే చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి. అందులో నథింగ్ కంపెనీ కూడా ఒకటి. ఈ కంపెనీ నథింగ్ ఫోన్ 4a ఫోన్ 4a ప్రో ధరలను భారీగా పెంచింది. అయితే, ఇప్పుడు అదే కంపెనీ నథింగ్ ఫోన్ 4a ప్రో భారీ ధర తగ్గింపుతో ఆఫర్ చేస్తోంది.

ఈ నథింగ్ ఫోన్ గ్లిఫ్ మ్యాట్రిక్స్‌తో స్పెషల్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్, ట్రిపుల్-కెమెరా సెటప్ స్నాప్‌డ్రాగన్ 7-సిరీస్ చిప్‌సెట్ (Nothing Phone 4a Pro) ద్వారా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కొత్త నథింగ్ ఫోన్‌ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..

అమెజాన్‌లో ధర ఎంతంటే? :

ప్రస్తుతం నథింగ్ ఫోన్ 4a ప్రో ఫోన్ రూ. 54,999 ధర నుంచి తగ్గి రూ. 47,840కి లిస్టు అయింది. ఈ తగ్గింపుతో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అదనంగా రూ. 1,435 ఆదా చేయొచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఇన్‌వాయిస్ నుంచి రూ. 22,500 వరకు తగ్గింపు పొందొచ్చు.

అయితే, ఈ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు నెలకు కేవలం రూ. 1,682 నుంచి ఈఎంఐతో ఈ నథింగ్ ఫోన్ కొనేసుకోవచ్చు. అదనంగా చెల్లిస్తే వారంటీతో పాటు ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌ కూడా పొందవచ్చు. మీ ఫోన్ పొరపాటున కింద పడినా కూడా చెక్కుచెదరదు.

Read Also : Samsung Galaxy S25 FE : రూ.60 వేల ఫోన్ రూ.48 వేలకే.. శాంసంగ్ గెలాక్సీ S25 FEపై అదిరిపోయే డీల్!

నథింగ్ ఫోన్ 4a ప్రో స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 4a ప్రో మోడల్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,400mAh బ్యాటరీ ఉంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇతర ఫీచర్లలో IP65 రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ OS బ్యాక్ సైడ్, 137 మినీ-ఎల్ఈడీతో కంపెనీ సిగ్నేచర్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఓఐఎస్ ఈఐఎస్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.