Samsung Galaxy S25 FE : రూ.60 వేల ఫోన్ రూ.48 వేలకే.. శాంసంగ్ గెలాక్సీ S25 FEపై అదిరిపోయే డీల్!
Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ ధర భారీగా తగ్గింది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 14వేలు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇలాంటి డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..

Samsung Galaxy S25 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S26 FE ఇప్పుడు భారీ డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. అమెజాన్ ఈ శాంసంగ్ మోడల్‌పై రూ. 14వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది.

భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 FE రూ. 59,999 ధరకు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, అమోల్డ్ డిస్ప్లే ప్రీమియం డిజైన్ అందిస్తుంది. ఇప్పుడు ఈ గెలాక్సీ S25 FE తగ్గింపు తర్వాత రూ. 50వేల లోపు ధరకే లభ్యమవుతోంది.

డీల్ వివరాలివే :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ రూ. 59,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 47,999కే లభిస్తోంది. రూ. 12వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే అదనంగా రూ. 2,399 ఆదా చేయొచ్చు. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ట్రేడ్-ఇన్ చేయొచ్చు.

స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ బ్యాక్‌తో వస్తుంది. అలాగే, ఈ హ్యాండ్సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 FE లోపల ఎక్సినోస్ 2400 చిప్సెట్ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీ అందించారు. 15W వైర్లెస్ ఛార్జింగ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP మెయిన్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 8MP టెలిఫోటో లెన్స్ 123-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.

మీరు కొనాలా? వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. రెగ్యులర్ కస్టమర్లకు అద్భుతంగా ఉంటుంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 45W ఛార్జింగ్ డిజైన్ మిడ్-ప్రీమియం ఆప్షన్లుగా చెప్పొచ్చు.

ఇందులో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కానీ, లాంగ్ టైమ్ ఫోన్ వాడితే కొన్నిసార్లు ఎక్సినోస్ 2400 కూడా హీట్ అవ్వొచ్చు. మీరు ఏదైనా భారీ మల్టీటాస్కింగ్ కోసం చూస్తే 8GB ర్యామ్ అంతగా సరిపోకపోవచ్చు.

ఏది ఏమైనా తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలంటే శాంసంగ్ గెలాక్సీ S25 FE అద్భుతమైన ఆప్షన్. కానీ, గేమర్లు, కెమెరా లేదా పర్ఫార్మెన్స్లో భారీ అప్గ్రేడ్లను కోరుకునే వారు అయితే మరో ఫోన్ తీసుకోవడమే మంచిది.
