Nothing Phone 4a
Nothing Phone 4a : నథింగ్ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అతి త్వరలో నథింగ్ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ 4a రాబోతుంది. కార్ల్ పీ నేతృత్వంలోని ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ ఫోన్ 4a ఈ వారం చివరిలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.
రాబోయే ఈ నింగ్ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇంకా రివీల్ కాలేదు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో స్పెషల్ మైక్రోసైట్ ఇటీవలే లైవ్ అయింది. వెబ్‌సైట్ ద్వారా లభ్యత, డిజైన్, కలర్ ఆప్షన్, స్పెసిఫికేషన్‌లతో వస్తుంది.
లండన్‌కు చెందిన టెక్ సంస్థ కర్ణాటకలోని బెంగళూరులో స్పెషల్ డ్రాప్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దేశంలో కొత్త నథింగ్ ఫోన్ 4a అమ్మకానికి రాకముందే వినియోగదారులు కొనేసుకోవచ్చు. కొత్త నథింగ్ ఫోన్ మొత్తం 4 కలర్ ఆప్షన్లలో రానుందని కంపెనీ వెల్లడించింది.
మార్చి 7న బెంగళూరులో ఎక్స్‌క్లూజివ్ డ్రాప్ ఈవెంట్ :
యూకేకి చెందిన ఈ టెక్ సంస్థ మార్చి 7న సాయంత్రం 6 గంటలకు స్పెషల్ డ్రాప్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వినియోగదారులు రాబోయే నథింగ్ ఫోన్ 4a అమ్మకానికి రాకముందే కొనేసుకోవచ్చు. బెంగళూరులోని ఇందిరానగర్‌లోని 660/1, 100 ఫీట్ రోడ్, 1వ స్టేజ్‌లో ఉన్న నథింగ్ స్టోర్‌లో లభ్యం కానుంది.
అదనంగా, ఫస్ట్ 100 మంది కస్టమర్లకు నథింగ్ ఫోన్ 4a స్పెషల్ ఎన్‌గ్రేవ్డ్ ఎడిషన్‌ను అందిస్తుంది. అలాగే ఫ్రీ నథింగ్ ఇయర్ ఎ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS)ను అందిస్తుంది. రాబోయే స్పెషల్ డ్రాప్ ఈవెంట్ సమయంలో కొత్త నథింగ్ ఫోన్ 4ఎ కొనుగోలు చేసే మొదటి 100 మందికి సీఎంఎఫ్ బడ్స్ 2 ప్లస్ TWSని రూ. 999 తగ్గింపు ధరకు పొందవచ్చు.
స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2026లో స్మార్ట్‌ఫోన్ తయారీదారు రాబోయే నథింగ్ ఫోన్ 4aను నాలుగు కలర్ ఆప్షన్లలో ప్రదర్శించింది. ఇప్పుడు బ్లాక్, బ్లూ, రోజ్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
మార్చి 5న సాయంత్రం 4 గంటలకు నథింగ్ ఫోన్ 4a భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ నథింగ్ ఫోన్ దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 7 ఎల్ఈడీ ఆప్షన్లతో కొత్త గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ నుంచి స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
ఇటీవలే భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 4a ధర ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ నథింగ్ ఫోన్ ప్రారంభ ధర రూ. 31,999కి లాంచ్ అవుతుందని అంచనా. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. అంతేకాదు.. భారత మార్కెట్లో 8GB+256GB, 12GB+256GB ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ వివరాలను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.