Nothing Phone 4b : వారెవ్వా.. నథింగ్ కొత్త ఫోన్ కేక.. 6,000mAh బ్యాటరీ, గ్లిఫ్ డిజైన్ అదుర్స్, ధర ఎంతంటే?

Nothing Phone 4b : భారత మార్కెట్లో నథింగ్ సంస్థ కొత్త నథింగ్ ఫోన్ 4b ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6వ జనరేషన్ 4 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, గ్లిఫ్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Nothing Phone 4b

  • నథింగ్ ఫోన్ 4బీ స్నాప్‌డ్రాగన్ 6వ జనరేషన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది
  • 6000mAh బ్యాటరీ, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, గ్లిఫ్ లైట్స్, ఎసెన్షియల్ కీ
  • నథింగ్ ఓఎస్ 4.1, 3 ఏళ్ల ఓఎస్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్

Nothing Phone 4b : నథింగ్ కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ 4బీ వచ్చేసింది. ప్రీమియం డిజైన్, స్నాప్‌డ్రాగన్ 6వ జెన్ 4 ప్రాసెసర్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ కంపెనీ బడ్జెట్ కేటగిరీలో చౌకైన ధరకే లభిస్తోంది. నథింగ్ డిజైన్, సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే యూజర్లకు ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు.

నథింగ్ ఫోన్ 4బీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది. 256జీబీ స్టోరేజ్ వేరియంట్ (Nothing Phone 4b) కూడా రూ. 38,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ సేల్ జూలై 14న కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే..
నథింగ్ ఫోన్ 4బీలో 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ సపోర్టు ఇచ్చే 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్, సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8జీబీ వరకు LPDDR4X ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 4,400 చదరపు మిల్లీమీటర్ల హీటింగ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది.

Read Also : Samsung Galaxy A36 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ మరి ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ ఓఎస్ 4.1పై రన్ అవుతుంది. 3 ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.

నథింగ్ ఫోన్ 4బీలో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6000mAh బ్యాటరీ ఉంది. 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో నథింగ్ ట్రాన్స్‌పరంట్ డిజైన్ లాంగ్వేజ్, గ్లిఫ్ లైటింగ్ ఎలిమెంట్స్, ఏఐ-ఆధారిత సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్‌తో పాటు ఎసెన్షియల్ కీ కూడా వస్తుంది. ఈ ఫోన్ బ్లూటూత్ 6.0, జీపీఎస్, Wi-Fi 6, QZSSతో సహా అన్ని స్టాండర్డ్ కనెక్టివిటీ ఆప్షన్‌లకు సపోర్ట్ చేస్తుంది.

8.6ఎమ్ఎమ్ మందంతో, 210 గ్రాముల బరువుతో వస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ ఉంది.