ONDC App _ How to download, eligible cities, how to use ONDC to order food at cheaper price
ONDC App : మీ ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? కొన్ని డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు అధిక పన్నులు, కమీషన్‌లు విధిస్తున్నాయా? ఫుడ్ ఆర్డర్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందా? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదు. ఇప్పటినుంచి ఇలాంటి పరిస్థితి లేకుండా ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారుల కోసం సరికొత్త ఫుడ్ ఆర్డర్ యాప్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం. ఫుడ్ ఆర్డర్ల కోసం ONDC (డిజిటల్ కామర్స్ ఓపెన్ నెట్‌వర్క్) డెవలప్ చేసింది. ఈ పుడ్ ఆర్డర్ యాప్.. Swiggy, Zomato వంటి మధ్యవర్తుల అవసరం లేకుండా రెస్టారెంట్‌లు నేరుగా తమ ఆహారాన్ని ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయించుకునేందుకు అనుమతిస్తుంది. ONDC అంటే.. వ్యాపారాలు తమ సర్వీసులను నేరుగా విక్రయించడానికి అనుమతించే ప్లాట్‌ఫారమ్ అని గమనించాలి.
2022 నుంచే ఈ యాప్ అందుబాటులోకి :
సెప్టెంబరు 2022 నుంచి ONDC యాప్ అందుబాటులో ఉంది. కానీ, ఇప్పుడిప్పుడే ఈ యాప్ పాపులర్ అవుతోంది. ప్రతిరోజూ 10వేల కన్నా ఎక్కువ రోజువారీ ఆర్డర్‌లను అందజేస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. గత రెండు రోజులుగా చాలా మంది నెటిజన్లు.. ONDC, Swiggy, Zomato అందించే ఫుడ్ డెలివరీ ధరల స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేస్తున్నారు. మిగతా ఫుడ్ డెలివరీ యాప్‌ల కన్నా ONDC ఫుడ్ ఆర్డర్ ధర చాలా తక్కువగా అందిస్తుంది. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్ కొత్తది కావడంతో అన్ని నగరాల్లో అందుబాటులో లేదు. అన్ని రెస్టారెంట్లు ONDC యాప్‌లో అందుబాటులో లేవు.
ONDC యాప్ ఎక్కడ ఉందంటే? :
మొట్టమొదట సెప్టెంబర్ 2022లో బెంగళూరులో ONDC యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, బెంగళూరు నివాసితులు మాత్రమే ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయగలరా? అంటే.. కచ్చితంగా కాదనే చెప్పాలి. మీరు ఇప్పటికీ Paytm యాప్ ద్వారా మీ నగరంలో యాప్‌ని యాక్సెస్ చేయవచ్చు.
ONDC App _ How to download, eligible cities, how to use ONDC to order food at cheaper price
అయితే, మీరు ఫుడ్ ఆర్డర్ చేసేందుకు మీ ప్రాంతంలోని రెస్టారెంట్లు తప్పనిసరిగా అందులో ఉండాలి. ONDC వెబ్‌సైట్ దేశవ్యాప్తంగా పిన్ కోడ్ జాబితా ఆధారంగా తెలుసుకోవచ్చు. దేశంలో ONDC నెట్‌వర్క్ ఎక్కడ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి కొనుగోలుదారు యాప్‌లు ఈ పిన్ కోడ్‌లలో కొన్నింటిని ఎంచుకోవచ్చు. అలాగే, ఆయా పిన్ కోడ్‌లోని సర్వీసు సామర్థ్యం ఆ పిన్ కోడ్‌లోని నిర్దిష్ట కొనుగోలుదారు స్థానంపై ఆధారపడి ఉంటుంది.
ONDCని ఎలా ఉపయోగించాలి? :
ONDC అనేది మీరు గూగుల్ ప్లే (Play Store) నుంచి డౌన్‌లోడ్ చేయడం కుదరదు.. ఇది ప్రత్యేక యాప్ కాదు. ONDC UPI మాదిరిగా పనిచేస్తుంది. అంటే.. ఇప్పటికే ఉన్న Paytm, PhonePe, Meesho మొదలైన యాప్‌లలో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ONDC యాప్ 29వేల కన్నా ఎక్కువ మంది డీలర్లు ఉన్నారు. ఈ ప్లాట్‌ఫారం ద్వారా 36 లక్షలకు పైగా ప్రొడక్టులను విక్రయిస్తున్నారు. ఇక, Paytm యాప్ ద్వారా ONDCని ఉపయోగించవచ్చు . Paytm యాప్‌కి వెళ్లి, సెర్చ్ బార్‌లో ‘ONDC’ అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు రెస్టారెంట్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఈ నెట్‌వర్క్ సాపేక్షంగా కొత్తది కనుక అన్ని రెస్టారెంట్లు దాని ద్వారా ఆహారాన్ని విక్రయించడం లేదని గమనించాలి.
పేటీఎం ద్వారా ఎలా ఆర్డర్ చేయొచ్చుంటే? :
ముందుగా.. Paytmకి వెళ్లండి.. సెర్చ్ బాక్సులో ‘ONDC’ అని టైప్ చేయండి లేదా హోమ్ స్క్రీన్ దిగువకు స్క్రోల్ చేయండి. మీరు ONDC స్టోర్‌ని చూడవచ్చు. కిరాణా సామాగ్రి, క్లీనింగ్ నిత్యావసర వస్తువుల నుంచి ఫుడ్ స్టోర్ల వరకు అనేక రకాల ఆప్షన్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీరు రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తే.. ONDC ఫుడ్‌కి వెళ్లండి. మీరు ఆర్డర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వంటకాలను చెక్ చేయండి. అప్పుడు మీకు అనేక రెస్టారెంట్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
ఇతర ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లతో మీరు చేసే విధంగానే మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. ONDC ప్లాట్‌ఫారమ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ యాప్ సర్వీసు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ యాప్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే లైవ్‌లో అందుబాటులో ఉంది. కానీ, Paytm అకౌంట్ ఉన్న ఎవరైనా ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయొచ్చు. తద్వారా ఆహారాన్ని సులభంగా ఆర్డర్ చేయవచ్చు.
Now you know the ONDC impact!
Same order, same place and same time.
The difference are clearly visible. pic.twitter.com/JG7xpjN8NB— Ankit Prakash (@ankitpr89) May 4, 2023