OnePlus 12R Sale Today : వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు, ధర, బ్యాంకు ఆఫర్లు మీకోసం..

OnePlus 12R Sale Today : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 అమ్మకానికి ఉన్నాయి. ఈ డివైజ్ ధర, బ్యాంకుల ఆఫర్‌లు, స్పెషిఫికేషన్లు, ఇతర వివరాలను ఓసారి చెక్ చేయండి.

OnePlus 12R and Buds 3 goes on sale_ check price, banks offers, specs and other details

OnePlus 12R Sale Today : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ అభిమానులు వన్‌ప్లస్ 12ఆర్ కొనుగోలు చేయొచ్చు. ఈ రోజు (ఫిబ్రవరి 6) నుంచే సేల్ మొదలైంది. గత నెలలో జరిగిన వన్‌ప్లస్ ‘స్మూత్ బియాండ్ బిలీఫ్’ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 12 సిరీస్, వన్‌ప్లస్ బడ్స్ 3ని ఆవిష్కరించింది. ఈ కొత్త లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 ఉన్నాయి. ఈ డివైజ్‌లు లాంచ్ అయిన తర్వాత జనవరి 30 నుంచి ప్రీ-ఆర్డర్‌ మొదలయ్యాయి. అయితే 12ఆర్, బడ్స్ 3 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.

Read Also : Best Premium Flagship Phones : 2024 జనవరిలో భారత్‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో వన్‌ప్లస్ 12ఆర్ మోడల్ ధర రూ.39,999కి వన్‌ప్లస్ బడ్స్ 3ని రూ.5,499కి పొందవచ్చు. అదనంగా, వన్‌ప్లస్ ప్రారంభ కొనుగోలుదారుల కోసం కొన్ని తగ్గింపులు, డీల్‌లను కూడా అందిస్తోంది. అయితే, వన్‌ప్లస్ 12ఆర్ యూనిట్లు ముందుగా ఆర్డర్ చేసిన వినియోగదారులకు షిప్పింగ్ అవుతాయి. ఈ కొత్త వన్‌ప్లస్ 12ఆర్, బడ్స్ 3పై పొందగల ఆఫర్‌లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.

వన్‌‌ప్లస్ 12ఆర్ సేల్ ఆఫర్లు :
మీరు ఇప్పుడు అమెజాన్ లేదా అధికారిక వన్‌ప్లస్ వెబ్‌సైట్ నుంచి వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. రూ. 39,999కి 8/128జీబీ, రూ.45,999కి 16/256 జీబీ అందిస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ మొత్తం కూల్ బ్లూ ఐరన్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

డిస్కౌంట్ల విషయానికొస్తే.. మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లేదా వన్‌కార్డ్‌తో చెల్లిస్తే.. రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు, వన్‌ప్లస్ సేల్ ప్రారంభమైన మొదటి 12 గంటల్లో మీరు వన్‌ప్లస్ 12ఆర్ ఆర్డర్ చేస్తే.. రూ. 4,999 విలువైన వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ఫ్రీ పెయిర్ కూడా అందిస్తోంది. అయితే, స్టాక్‌లు పరిమితంగా ఉన్నందున మొదటి కొద్ది మంది కస్టమర్‌లు మాత్రమే ఆఫర్‌ను పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్‌లు, ఫ్రీ బడ్స్ జెడ్2తో పాటు వన్‌ప్లస్ 12ఆర్ కొనుగోలు చేసినప్పుడు రూ. 2,250 వరకు జియో ప్లస్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇందులో ప్రతి నెల రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌పై రూ.150 తగ్గింపు ఉంటుంది. మీరు వన్‌ప్లస్ 12ఆర్ మోడల్ ఆర్‌సీసీ అకౌంటుకు లింక్ చేయడం ద్వారా వరుసగా రూ. 1,200, రూ. 3,000 వరకు విలువైన వన్‌ప్లస్ ఆడియో, వన్‌ప్లస్ ప్యాడ్ కోసం కూపన్‌లను కూడా పొందవచ్చు. మీరు ప్రొటెక్షన్ ప్లాన్‌పై 50 శాతం తగ్గింపుతో వన్‌ప్లస్ 12ఆర్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, వన్‌‌ప్లస్ 12ఆర్ కొనుగోలుపై వరుసగా 6 లేదా 3 నెలల పాటు గూగుల్ వన్, యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది.

OnePlus 12R and Buds 3 goes on sale 

వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 12ఆర్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78- అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ద్వారా 16జీబీ వరకు ఎల్ పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. హుడ్ కింద 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌తో 5500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

వన్‌ప్లస్ బడ్స్ 3 సేల్ ఆఫర్‌లు :
వన్‌ప్లస్ బడ్స్ 3 కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, డెబిట్, క్రెడిట్ కార్డ్ రెండింటిపై ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. అదనంగా వన్‌‌కార్డ్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్‌లపై రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దానితో పాటు వన్‌ప్లస్ 12/12ఆర్ లింక్డ్ డివైస్ సభ్యులు అదనంగా రూ. 800 తగ్గింపు పొందవచ్చు. ఇతర వన్‌ప్లస్ లింక్డ్ డివైజ్ మెంబర్లు అయితే అదనంగా రూ. 300 తగ్గింపును కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్ బడ్స్ 3 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ బడ్స్ 3 ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 44 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని వన్‌ప్లస్ పేర్కొంది. ఇయర్‌బడ్‌లు పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు (ANC) ఆఫ్‌తో (AAC) మోడ్‌లో 50 శాతం వాల్యూమ్‌తో 10 గంటల వరకు ప్లే చేయగలవు. ఏఎన్‌సీ ఆన్‌లో ఉన్న ఏఏసీ మోడ్‌లో ఛార్జింగ్ కేస్ 50 శాతం వాల్యూమ్‌తో బ్యాటరీ లైఫ్ 28 గంటల వరకు ఉంటుంది.

Read Also : Best Phones in India : ఈ ఫిబ్రవరిలో రూ. 35వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు