Amazon Prime Day Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ కొనసాగుతోంది. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R మోడల్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Prime Day Sale

Amazon Prime Day Sale : వన్‌ప్లస్ అభిమానుల కోసం అద్భుతమైన డీల్స్.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా వన్‌ప్లస్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా (Amazon Prime Day Sale) వన్‌ప్లస్ 13 సిరీస్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R రెండూ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 ధర రూ. 69,999కు లాంచ్ కాగా, వన్‌ప్లస్ 13R ధర రూ. 42,999కు లాంచ్ అయింది. అయితే, వినియోగదారులు ఇప్పుడు వన్‌ప్లస్ 13 రూ. 60వేల లోపు ధరకు, వన్‌ప్లస్ 13R రూ. 40వేల లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 13 ధర :
వన్‌ప్లస్ 13 ధర రూ.64,999కి అందుబాటులో ఉంది. రూ.5వేలు ధర తగ్గింపు పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కస్టమర్లు అదనంగా రూ.5వేలు తగ్గింపును పొందవచ్చు. ధర రూ.60వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. కస్టమర్లు నెలకు రూ.3,151 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

Read Also : Amazon Prime Day Sale 2025 : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్‌లో బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్ డీల్స్ మీకోసం.. ఓసారి లుక్కేయండి..!

కస్టమర్లు రూ.52వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఫోన్ మోడల్, బ్రాండ్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. 16GB, 256GB వేరియంట్లకు వర్తిస్తుంది. కస్టమర్లు 3 కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.

వన్‌ప్లస్ 13R ధర :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 సమయంలో వన్‌ప్లస్ 13R భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ వన్‌ప్లస్ 13R ఫోన్ రూ.42,997 ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లు రూ.39,999 ధరకు పొందవచ్చు. కస్టమర్లు ఫోన్‌తో పాటు ఫ్రీగా వన్‌ప్లస్ బడ్స్ 3ని పొందవచ్చు. ప్రస్తుతం ఈ బడ్స్ ధర రూ.4,300 ఉండగా, కస్టమర్లు నెలకు రూ.2,085 ఈఎంఐతో పొందవచ్చు. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.