OnePlus 13 : ఆఫర్ అదుర్స్ మావా.. వన్‌ప్లస్ 13పై ఏకంగా రూ. 11వేలు డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
OnePlus 13 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 ఫోన్ భారీగా తగ్గింది. 50MP కెమెరా ఫోన్ ప్రస్తుతం రూ. 11వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- August 13, 2026 / 02:48 PM IST
OnePlus 13 gets cheaper on Amazon
- ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 ఫోన్ భారీ తగ్గింపు
- 6.82-అంగుళాల క్వాడ్ HD+ ఎల్టీపీఓ 4.1 ProXDR డిస్‌ప్లే
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
50MP ప్రైమరీ కెమెరా సెటప్, ధర ఎంతంటే?
OnePlus 13 Sale : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ. 60వేలు అయితే, వన్‌ప్లస్ 13 అద్భుతమైన ఆఫర్.
ఈ సేల్ సమయంలో ఈ వన్‌ప్లస్ 13 కొనుగోలుపై ధర తగ్గింపు, మరెన్నో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ (OnePlus 13) ఆఫర్లు పొందవచ్చు. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ 13 ఆఫర్లు, డిస్కౌంట్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ 13 ధర ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వన్‌ప్లస్ 13 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 61,990 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 3575 డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో అసలు ధర రూ. 58,415 అవుతుంది.
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 55,200 సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది జనవరిలో రూ. 69,999 ధరకు వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.11,584 తగ్గింపు ధరకే లభిస్తోంది.
వన్‌ప్లస్ 13 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13లో 6.82-అంగుళాల క్వాడ్ HD+ ఎల్టీపీఓ 4.1 ProXDR డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1440×3168 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz టాప్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC జీపీఎస్ ఉన్నాయి.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
వన్‌ప్లస్ 13లో ఎఫ్/1.6 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.6 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP అల్ట్రావైడ్ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఎఫ్/2.4 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 162.9 మిమీ పొడవు, 76.5 మిమీ వెడల్పు, 8.9 మిమీ మందం, 213 గ్రాముల బరువు ఉంటుంది.
