OnePlus 15R Offer : ఈ వన్‌ప్లస్ ఫోన్ మీ బడ్జెట్‌ ధరలో.. ఇలా కొంటే రూ. 3వేలు తక్కువకే..!

OnePlus 15R Offer : వన్‌ప్లస్ 15ఆర్ ధర తగ్గింది. ఈ ఆగస్టులో అమెజాన్ ద్వారా రూ. 3వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

OnePlus 15R Offer

  • వన్‌ప్లస్ 15ఆర్ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే
  • 50MP ప్రైమరీ కెమెరా, 7400mAh బ్యాటరీ ఆప్షన్
  • 12జీబీ, 256జీబీ స్టోరేజ్, 32MP ఫ్రంట్ కెమెరా

OnePlus 15R : వన్‌ప్లస్ అభిమానులకు పండగే.. కొత్త వన్‌ప్లస్ 15R డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. మీరు బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గింపు పొందవచ్చు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ 7400mAh బ్యాటరీ ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా (OnePlus 15R Offer) ఉన్నాయి. వన్‌ప్లస్ 15Rపై డిస్కౌంట్లు, ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

వన్‌ప్లస్ 15ఆర్ ధర ఆఫర్లు
ఈ కొత్త ఫోన్ 12జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.59,999 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఫ్లాట్ రూ.3వేలు డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా ధర రూ.56,999 అవుతుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేసుకోవచ్చు.

Read Also : Top 4 Electric Cars : రూ. 10 లక్షల్లో కొత్త EV కారు.. టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్‌లో ఏది కింగ్?

వన్‌ప్లస్ 15ఆర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 15ఆర్‌లో 2800×1272 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. వన్‌ప్లస్ 15R ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. బ్యాటరీ సామర్థ్యం 7400mAh, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. :
వన్‌ప్లస్ 15ఆర్ ఎఫ్/1.8 అపర్చర్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP కెమెరా ఉంది. వన్‌ప్లస్ 15Rలో కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, 5G, డ్యూయల్ 4G VoLTE, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.