OnePlus Ace 7 Pro : వన్‌ప్లస్ నుంచి ‘బాహుబలి’ ఫోన్? 200MP కెమెరాతో ఫుల్ మాస్.. స్పెక్స్ చూస్తే మైండ్ బ్లాంక్!

OnePlus Ace 7 Pro : వన్‌ప్లస్ ప్రో ఫోన్ వస్తోందోచ్.. 20MP కెమెరా, 16జీబీ ర్యామ్, 6.78-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో రాబోతుంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.

OnePlus Ace 7 Pro

  • 200MP మెయిన్ లెన్స్‌తో పాటు 2 కెమెరాలు
  • ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 16MP కెమెరా సెటప్
  • ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌

OnePlus Ace 7 Pro : కొత్త వన్‌ప్లస్ ఫోన్ లీక్ అయింది. కంపెనీ రాబోయే వన్‌ప్లస్ ఏస్ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో పేరుతో మార్కెట్లోకి రానుంది. లీక్ డేటా ప్రకారం.. ఈ ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ప్రస్తుతానికి వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఈ రాబోయే ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో లాంచ్‌కు ముందే లీక్ అయింది. రాబోయే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్ ప్రో మోడల్ వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్‌లో చేరనుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. రాబోయే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలను కూడా రివీల్ చేశారు.

ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో 6.78-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. 1.5K రిజల్యూషన్ 185Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్మూత్ స్క్రోలింగ్ అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రెడ్‌మి K100 ప్రో మాక్స్ వన్‌ప్లస్ 15 వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు అదే చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా రన్ అవుతుందని భావిస్తున్నారు.

Read Also : Nothing Phone 3 Price : డైరెక్ట్ డిస్కౌంట్ మావా.. ఈ నథింగ్ ఫోన్ 3పై ఊరమాస్ డీల్.. అమెజాన్‌లో ఎంతంటే?

నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో 16GB ర్యామ్‌తో వస్తుందని అంచనా. కంపెనీ 1TB వరకు స్టోరేజ్‌ కూడా అందించనుంది. ఈ ఫోన్‌లో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుందని భావిస్తున్నారు.

కెమెరా విషయానికి వస్తే.. :
ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ లెన్స్‌తో సహా 2 కెమెరాలు ఉండొచ్చు. రెండో కెమెరాలో 50MP సెన్సార్ ఉండొచ్చు. ఈ ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుందని అంచనా. వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ సంబంధించి ఎలాంటి వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు.

గత ఏడాది దేశీయ మార్కెట్లో కంపెనీ లాంచ్ చేసిన వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా మాదిరిగానే అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్ ఉంది. దీనికి 165Hz రిఫ్రెష్ రేట్ 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, ఏఆర్ఎమ్ మాలి-జీపీయూతో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో ఆటోఫోకస్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఏస్ 6 అల్ట్రాలో 8,600mAh బ్యాటరీ ఉంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.