OnePlus Ace 7 Series : గేమర్లకు పండగే! వన్‌ప్లస్ ఏస్ 7 వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో అదరగొట్టే ఫీచర్లు!
OnePlus Ace 7 Series : వన్‌ప్లస్ ఏస్ 7, ఏస్ 7 ప్రో ఫోన్లలో 9,000mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లే, పవర్ఫుల్ చిప్సెట్ ఉండొచ్చు. భారత్‌లో ధర, ఫీచర్లు, లాంచ్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Published on- October 16, 2026 / 03:56 PM IST
OnePlus Ace 7 Series
- గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్..
- వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో లీక్.. అదిరిపోయే స్పెసిఫికేషన్లు
- 9,000mAh బ్యాటరీ, 185Hz వరకు రిఫ్రెష్ రేట్
OnePlus Ace 7 Series : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో కొత్త ఏస్ 7 సిరీస్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్టు టెక్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ ఏస్ 7తో పాటు ఏస్ 7 ప్రో మోడల్ కూడా ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. అయితే, ఈ ఫోన్లకు సంబంధించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలిపై ఓసారి లుక్కేయండి..
గీక్‌బెంచ్‌లో అదరగొట్టిన ఏస్ 7 ప్రో :
వన్‌ప్లస్ ఏస్ 7, ఏస్ 7 ప్రో మోడళ్లు గూగుల్ ప్లే సపోర్ట్ చేసే డివైజ్ లిస్టులో కనిపించినట్లు సమాచారం. ఈ మోడల్ నంబర్లు వరుసగా PYF110, PMS110గా ఉన్నాయి. మరోవైపు, ఏస్ 7 ప్రో గీక్‌బెంచ్ సింగిల్-కోర్ పరీక్షలో 3,112 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో 10,451 పాయింట్లు సాధించినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లే :
ఈ సిరీస్‌లోని ఫోన్లకు సంబంధించిన లీక్ డేటా రివీల్ అయింది. వన్‌ప్లస్ ఏస్ 7లో ఏకంగా 9,000mAh బ్యాటరీ, 185Hz వరకు రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉండొచ్చని అంచనా. అలాగే, కస్టమ్ వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్ అందించే అవకాశం ఉంది.
గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా చూసేందుకు కొత్త థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో పాటు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కూడా అందించవచ్చని సమాచారం. బ్యాక్ సైడ్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి.
భారత్‌లో వన్‌ప్లస్ 16Rగా ఎంట్రీ? :
ఈ సిరీస్ చైనాలో లాంచ్ కావచ్చని అంచనా. భారత్‌లో వన్‌ప్లస్ 16R పేరుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. భారత మార్కెట్లో ధర రూ.70వేల నుంచి రూ.75వేల మధ్య ఉండొచ్చని అంచనా. అయితే, లాంచ్ తేదీ, ధర, ఫీచర్లపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
