OnePlus Ace 7 Series : గేమర్లకు గుడ్ న్యూస్.. 9,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్ వస్తోంది.. ధరపై భారీ అంచనాలివే..!

OnePlus Ace 7 Series : వన్‌ప్లస్ ఏస్ 7, ఏస్ 7 ప్రో ఫోన్లు వచ్చేస్తున్నాయి.. 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, అమోల్డ్ డిస్‌ప్లే, ప్రాసెసర్ ఫీచర్లతో రానున్నాయి. ధర, ఇతర ఫీచర్ల వివరాలివే..

OnePlus Ace 7 Series

  • వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్‌లో బేస్ మోడల్‌, ఏస్ 7 ప్రో
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 9,000mAh బ్యాటరీ సెటప్
  • 200MP కెమెరా, భారీ బ్యాటరీ.. అదిరే ఫీచర్లు

OnePlus Ace 7 Series : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సంచలనానికి వన్‌ప్లస్ రెడీ అయింది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వన్ ప్లస్ ఏస్ 7 సిరీస్‌ రాబోతుంది. వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్, వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. అయితే, ఈ రెండు ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ధర (అంచనా) :
చైనాలో ధరల ప్రకారం వన్ ప్లస్ ఏస్ 7 బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర CNY 4,399గా ఉంది. టాప్ వేరియంట్ల ధర CNY 5,699 వరకు ఉంది. మరోవైపు వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో బేస్ మోడల్ ధర CNY 4,799గా కొన్ని హై స్టోరేజ్ వేరియంట్ల ధర CNY 7,299 వరకు ఉండొచ్చు.. భారత కరెన్సీలో సుమారు రూ.68,600 నుంచి రూ.1,04,400 వరకు ఉంటాయి. ఈ ఫోన్ ధరలు కేవలం అంచనాలు మాత్రమే..

Read Also : Samsung W27 Launch : ఐఫోన్ డ్యూయోకు పోటీగా.. లగ్జరీ లుక్‌తో శాంసంగ్ W27 ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ.2.72 లక్షల పైనే!

9,000mAh బ్యాటరీ.. 200MP కెమెరా హైలైట్ :
ఈ సిరీస్‌లో 9,000mAh బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్.. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి ఈ బ్యాటరీ సామర్థ్యం ఆసక్తికరంగా ఉంటుంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. :
6.78 అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్, 185Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉండొచ్చు.. గేమింగ్, వీడియోలు చూడటం, రోజువారీ టాస్కులను వేగంగా కంప్లీట్ చేయొచ్చు. కెమెరా కేటగిరీలో 2 ఫోన్లకూ 200MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఏస్ 7లో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, ఏస్ 7 ప్రోలో 50MP టెలిఫోటో కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్, ఇతర ఫీచర్లు :
వన్‌ప్లస్ ఏస్ 7లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5వి, ఏస్ 7 ప్రోలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్లు ఉండొచ్చు.. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గ్లేసియర్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లు నవంబర్ 3న చైనాలో అమ్మకానికి వస్తాయని అంచనా..