OnePlus N6x Launch : కొత్త వన్‌ప్లస్ N6x ఫోన్ వచ్చేస్తోంది.. టెక్చర్డ్ బ్యాక్‌తో స్టైలిష్ ఎంట్రీ!

OnePlus N6x Launch : రాబోయే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు గరుకుగా, చదునుగా ఉండే బ్యాక్ ప్యానెల్ ఉన్నట్లు కనిపిస్తోంది. రియర్ ప్యానెల్ మధ్యలో వన్‌ప్లస్ బ్రాండింగ్ ఉంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉన్నాయి.

OnePlus N6x Launch

  • జూలై 31న భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ N6x లాంచ్
  • అమెజాన్‌లో వన్‌ప్లస్ కొత్త ఫోన్ మైక్రోసైట్
  • బ్యాక్ ప్యానెల్ మధ్యలో వన్‌ప్లస్ బ్రాండింగ్

OnePlus N6x Launch : వన్‌ప్లస్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. వన్‌ప్లస్ కంపెనీ నుంచి త్వరలో సరికొత్త ఫోన్ రాబోతుంది. గత నెల చివర్లో భారత మార్కెట్లో సరసమైన ధరకే వన్‌ప్లస్ N6 లాంచ్ కాగా, ఇప్పుడు ఇదే సిరీస్‌లో రెండో మోడల్ వన్‌ప్లస్ N6x కూడా రిలీజ్ కానుంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ N6x ఫోన్ సంబంధించి మైక్రోసైట్ క్రియేట్ చేసింది. కంపెనీ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 31న భారత మార్కెట్లోకి వస్తుంది.

వన్‌ప్లస్ ఫోన్ ఐస్ బ్లూ బర్గుండి రెడ్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అలాగే, క్యాప్సల్ షేప్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ (OnePlus N6x Launch) కెమెరా యూనిట్ ఉండొచ్చు. ఇందులో కెమెరా మాడ్యూల్‌తో పాటు సింగిల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. వన్‌ప్లస్ N6x ఫోన్ సరసమైన ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్ ప్యానెల్ మధ్యలో వన్‌ప్లస్ బ్రాండింగ్ ఉండగా, పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉన్నాయి. దాంతో పాటు డిజైన్ దాదాపుగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 డిజైన్‌తో వస్తుంది. గత నెలలో భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఎన్6 లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 కాగా, 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : ఖతర్నాక్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 44వేలు డిస్కౌంట్.. ఎలాగంటే?

వన్‌ప్లస్ ఎన్6 ఫోన్ ఫ్రెష్ మింట్ మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ 1,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ 6.75-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ ఎన్6లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్ ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.

ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 10x డిజిటల్ జూమ్‌తో 50MP సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 8,000mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై బ్యాటరీ 3 రోజుల వరకు రన్ అవుతుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,300mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.