OnePlus Nord 6 : పండగ చేస్కోండి.. వన్‌ప్లస్ నార్డ్ 6పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
OnePlus Nord 6 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సందర్భంగా వన్‌ప్లస్ నార్డ్ 6 డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. ఈ అదిరే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- October 14, 2026 / 01:05 PM IST
OnePlus Nord 6 Sale Offer
- వన్‌ప్లస్ నార్డ్ 6లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 ప్రాసెసర్
- 9,000mAh బ్యాటరీ, 6.78-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే
- అమెజాన్‌లో రూ. 44,999 అతి తక్కువ ధరకే లభ్యం
OnePlus Nord 6 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి భారీ గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 సమయంలో మీరు కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇప్పడే కొనేసుకోండి. వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ ఈ-కామర్స్ సైట్లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 6 డీల్స్, ఆఫర్లు, ధరలను ఇప్పుడు పూర్తిగా పరిశీలిద్దాం..
వన్‌ప్లస్ నార్డ్ 6 ధర, ఆఫర్లు :
వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్, అసలు ధర రూ.52,999 నుంచి పెరిగి అమెజాన్‌లో రూ. 44,999 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ (రూ. 1,000 వరకు) అందిస్తుంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 43,999కి తగ్గింది.
Read Also : Apple MacBook Neo : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఆపిల్ మ్యాక్‌బుక్ నియో అతి చౌకైన ధరకే.. ఎలా కొనాలంటే?
వన్‌ప్లస్ నార్డ్ 6 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 6 లో 1272×2772 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ 3600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16 పై రన్ అవుతుంది.
ఫ్రంట్ సైడ్ OIS సపోర్ట్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో 9,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, బ్లూటూత్ 6, జీపీఎస్, Wi-Fi, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
