Best Smartphones : రూ. 30 వేల బడ్జెట్‌లో వన్‌ప్లస్, వివో, రియల్‌మి.. కెమెరా, బ్యాటరీ, గేమింగ్‌లో అసలు బెస్ట్ ఫోన్ ఏది?

Best Smartphones : రూ. 30వేల బడ్జెట్ ధరలో ఫోన్ కావాలా? వివో టి5 ప్రో 5జి, రియల్‌మి 15 ప్రో 5జీలకు పోటీగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లభిస్తోంది. ఈ ఫోన్లలో ఏది కొంటే బెటర్ అంటే?

Best Smartphones 2026 (Image Credit : Gemini AI )

  • వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌
  • వివో టీ5 ప్రో 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌
  • రియల్‌మి 15 ప్రో 5జీ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌

Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 30వేల బడ్జెట్ ధరలో మార్కెట్లో అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్ షేక్ చేస్తున్న వివో టీ5 ప్రో 5జీ, రియల్‌మీ 15 ప్రో 5జీలకు పోటీగా వన్‌ప్లస్ భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6ను లాంచ్ చేసింది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. వివో టీ5 ప్రో 5జీ ఫోన్ క్వాల్‌కామ్ (Best Smartphones) స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. రియల్‌మి 15 ప్రో 5జీ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6, వివో టీ5 ప్రో 5జీ, రియల్‌మి 15 ప్రో 5జీ ఫోన్లను వివరంగా పోల్చి చూద్దాం..

ధర, స్టోరేజీ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫోన్ 8జీబీ/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, 8జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999కు లభిస్తుంది. వివో టీ5 ప్రో 5జీ, 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999, 12జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999కు పొందవచ్చు. రియల్‌మి 15 ప్రో 5జీ ఫోన్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999, 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999కు పొందవచ్చు.

డిస్‌ప్లే, రిజల్యూషన్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫోన్ 2772×1272 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ 3840Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. వివో T5 ప్రో 5జీ, 2392×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రియల్‌మి 15 ప్రో 5జీ ఫోన్ 2800×1280 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ టాప్ బ్రైట్‌సెస్ అందించే 6.8-అంగుళాల ఫుల్ HD+ 4D కర్వ్+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

ప్రాసెసర్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. వివో టి5 ప్రో 5జి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. రియల్‌మి 15 ప్రో 5జీ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Read Also : Samsung Galaxy A36 5G : కొంటే శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ గెలాక్సీ A36 5Gపై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

ఆపరేటింగ్ సిస్టమ్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. వివో టీ5 ప్రో 5జీ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది. రియల్‌మి 15 ప్రో 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి యుఐ 6.0 పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ OISతో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

వివో T5 ప్రో 5జీ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మి 15 ప్రో 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఎఫ్/2.4 అపర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లు :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6 5జీ ఫోన్ డ్యూయల్ 4జీ వోఎల్‌టీఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యుఎస్‌బీ టైప్-సీ 2.0 పోర్ట్‌తో వస్తుంది. వివో టీ5 ప్రో 5జీ 5జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై, జీపిఎస్, ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, టైప్-సి 3.0 పోర్ట్‌తో వస్తుంది. రియల్‌మి 15 ప్రో 5జీ 5జీ, డ్యూయల్ 4జీ వోఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, యుఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో వస్తుంది.

బ్యాటరీ బ్యాకప్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6లో 8000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో T5 ప్రో 5జీలో 9020mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మి 15 ప్రో 5జీలో 7000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.