OnePlus Turbo 6Vs Launch : 9,000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ టర్బో 6Vs వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!
OnePlus Turbo 6Vs Launch : వన్‌ప్లస్ టర్బో 6Vs ఫోన్ లాంచ్ అయింది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 9,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది.. ఫీచర్లు, ధర వివరాలివే..
- Sreehari A
- Updated on- November 2, 2026 / 09:58 AM IST
OnePlus Turbo 6Vs Launch
- వన్‌ప్లస్ టర్బో 6Vs ఫోన్ వచ్చేసింది
- భారీ 9000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
OnePlus Turbo 6Vs Launch : వన్‌ప్లస్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేసింది.. వన్‌ప్లస్ టర్బో 6Vsను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 2026 ప్రారంభంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ టర్బో 6Vకి అప్‌గ్రేడ్ వెర్షన్.
ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ చైనీస్ వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. సేల్ కూడా అయిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 9,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది..
వన్‌ప్లస్ టర్బో 6Vs ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ టర్బో 6Vs ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ. 52,851) ఉంటుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ చైనీస్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి లభిస్తుంది. ఆరెంజ్, నోవా వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది..
Read Also : EPFO WhatsApp Services : ఇక వాట్సప్‌లోనే PF బ్యాలెన్స్.. పాస్‌బుక్ డౌన్‌లోడ్ కూడా.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి!
వన్‌ప్లస్ టర్బో 6Vs ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ టర్బో 6Vs ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2772×1272 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 144Hz, బ్రైట్‌నెస్ 800 నిట్స్, టాప్ పీక్ బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8.5 మిమీ మందం, 215 గ్రాముల బరువు ఉంటుంది.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఇతర ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, ఎక్స్-యాక్సిస్ మోటార్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
వన్‌ప్లస్ టర్బో 6Vsలో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, బ్యాక్ సైడ్ 2MP మోనో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇందులో 9,000mAh బ్యాటరీ కూడా ఉంది. 80W వైర్డ్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 12GB LPDDR4X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
