OPPO A7 Pro 5G : వారెవ్వా.. ఈ ఒప్పో 5G ఫోన్ అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర జస్ట్ ఎంతంటే?

OPPO A7 Pro 5G : ఒప్పో నుంచి ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది. 8000mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌, మీడియాటెక్ డైమన్షిటీ 6360 మ్యాక్స్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

  • Published on- September 13, 2026 / 07:34 PM IST

OPPO A7 Pro 5G

  • అదిరే ఫీచర్లతో ఒప్పో ఎ7 ప్రో 5జీ లాంచ్
  • బేస్ మోడల్ 6GB ర్యామ్, 256GB స్టోరేజ్‌
  • 8000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్

OPPO A7 Pro 5G : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో A7 సిరీస్‌ వచ్చేసింది. ఈ కొత్త ఒప్పో A7 ప్రో 5జీ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లోని కీలక ఫీచర్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్, 120Hz ఓఎల్ఈడీ డిస్‌ప్లే, IP69K రేటింగ్ ఉన్నాయి. ధర, కెమెరా, ఫీచర్లు, IP69K-రేటెడ్ బాడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ధర ఎంతంటే? :
ఒప్పో A7 ప్రో 5జీని చైనాలో 2 ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో లాంచ్ చేసింది. బేస్ మోడల్ 6GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ధర (OPPO A7 Pro 5G) సుమారుగా రూ. 31వేలు కాగా, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో హై-ఎండ్ వేరియంట్ ధర దాదాపు రూ. 35,300గా ఉంది. భారత మార్కెట్లో లాంచ్ తేదీ, ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

డిస్‌ప్లే అదుర్స్ :
ఈ ఫోన్ డిస్‌ప్లే 2372 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.57-అంగుళాల 1.5K స్క్రీన్ అందిస్తుంది. ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ 1400 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.

Read Also : AI Camera Blunder : ఇదెక్కడి చోద్యం.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.. చలాన్ చూసి షాకైన డ్రైవర్!

ప్రాసెసర్ కూలింగ్ సిస్టమ్ :

పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్ 2.4GHz వరకు వేగంతో రన్ అవుతుంది. ఈ ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16తో రన్ అవుతుంది. ఇందులో 4300mm VC (వేపర్ ఛాంబర్) కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్ :
ఒప్పో A7 ప్రో 5జీ ఫోన్ 8000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీరు బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు.

కెమెరా సెటప్ :
కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఒప్పో సింపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎఫ్/1.9 అపర్చర్‌తో 50MP కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి తోడుగా సెకండరీ ఏఐ లెన్స్ కూడా ఉంది. ఈ కెమెరా మాడ్యూల్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా చేర్చారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు :
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఒప్పో A7 ప్రో 5జీ ఫోన్ వై-ఫై 5, బ్లూటూత్ 5.4, NFC అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. ఆడియో విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ స్పీకర్లు, 300శాతం సూపర్ వాల్యూమ్ మోడ్ ఉన్నాయి.