Oppo F33 Series : ఒప్పో నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే? ఫుల్ డిటెయిల్స్

Oppo F33 Series : ఒప్పో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఒప్పో F33 సిరీస్ ఏప్రిల్ 15న లాంచ్ చేయనుంది. ఒప్పో ఎఫ్33 ప్రో, ఒప్పో ఎఫ్33 మోడళ్లకు సంబంధించి కీలక ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి.

Oppo F33 Series

  • కొత్త ఒప్పో ఎఫ్33 సిరీస్‌లో మొత్తం 2 ఫోన్లు లాంచ్
  • ఒప్పో F33 ప్రో 5జీ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లు
  • డ్యూయల్ రియర్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా

Oppo F33 Series : ఒప్పో అభిమానుల కోసం సరికొత్త 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఒప్పో F33 ప్రో 5జీ వచ్చే వారం భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ప్రకటించింది. ఈ కొత్త ఎఫ్ ప్రోతో పాటు ఒప్పో F33 5జీ ఫోన్ కూడా లాంచ్ కానుంది.

ఈ టెక్ సంస్థ ఒప్పో F33 ప్రో 5జీ లాంచ్ తేదీని రివీల్ చేసింది. ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ స్టాండర్డ్ ఒప్పో ఎఫ్33 5జీలతో కొత్త ఒప్పో F33 సిరీస్ ఏప్రిల్ 15న భారత మార్కెట్లో లాంచ్ చేయనుందని కంపెనీ ధృవీకరించింది.

ఈ ఒప్పో ఫోన్ మిస్టీ ఫారెస్ట్, స్టార్రీ బ్లూ ప్యాషన్ రెడ్ అనే 3 కలర్ ఆప్షన్లలో విక్రయించనుందని కూడా కంపెనీ ధృవీకరించింది. ఈ ఒప్పో ఫోన్ OV50D40 సెన్సార్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉంటాయని ఆ టెక్ సంస్థ వెల్లడించింది.

Read Also : OnePlus Nord 6 Sale : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6 అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?

ఒప్పో F33 ప్రో 5జీలో 100-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇందులో GC50F6 సెన్సార్, ఎఫ్/2.0 అపర్చర్, 18mm ఫోకల్ లెంగ్త్ ఆటోఫోకస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్-వ్యూ వీడియో కలర్‌ఫుల్ ఫ్రంట్ ఫిల్ లైట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఒప్పో K33 ప్రో 5జీ ఫోన్ ఏఐ పోర్ట్రెయిట్ గ్లోతో పాటు నాచురల్ లైట్, ఫ్లాష్‌లైట్, రిమ్ లైట్, స్టూడియో లైట్ కెమెరా ఎఫెక్ట్‌ కూడా అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ ఆధారిత కలర్‌ఓఎస్ వెర్షన్‌పై రన్ అవుతుంది.

డిజైన్ పరంగా చూస్తే.. ఒప్పో F33 ప్రో 5G రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్‌ అందిస్తుంది. ఇందులో రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ రెండు కెమెరా లెన్స్‌లు ఉండొచ్చు. ఈ ప్యానెల్ కింది భాగం మధ్యలో ఒప్పో బ్రాండింగ్ కనిపిస్తుంది. ఫ్లాట్ బ్యాక్ ఫ్లాట్ ఫ్రేమ్‌తో కూడా వస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69K రేటింగ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఫోన్ రైట్ సైడ్ ఉంటాయి. అయితే, లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంటుంది.