Oppo F33 5G Series : వావ్.. కొత్త ఒప్పో F33 5G ఫోన్లు వచ్చేశాయ్.. 7000mAh బ్యాటరీ, ఫీచర్లు ఖతర్నాక్ భయ్యా.. ఫస్ట్ సేల్ ఆఫర్లు..!
Oppo F33 5G Series : భారత మార్కెట్లో ఒప్పో F33 ప్రో 5జీ, ఒప్పో F33 5జీ అనే రెండు కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ ఉన్నాయి.
- Sreehari A
- Published on- April 15, 2026 / 06:44 PM IST
Oppo F33 5G Series
- ఒప్పో నుంచి రెండు సరికొత్త F33 5G సిరీస్ ఫోన్లు
- భారత మార్కెట్లో ఒప్పో F33 ప్రో 5G, F33 5G సిరీస్
- 50MP మెయిన్ కెమెరా 80W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీ
Oppo F33 5G Series : ఒప్పో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఒప్పో నుంచి కిర్రాక్ ఫీచర్లతో రెండు కొత్త 5జీ ఫోన్లు వచ్చేశాయి. చైనీస్ టెక్ బ్రాండ్ ఒప్పో భారత మార్కెట్లో ఎఫ్-సిరీస్ కింద ఈ రెండు కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.
అందులో ఒప్పో F33 ప్రో 5G, ఒప్పో F33 5G ఫోన్లు ఉన్నాయి. కంపెనీ ప్రకారం.. ఈ రెండు (Oppo F33 5G Series) హ్యాండ్‌సెట్‌లు 50MP మెయిన్ కెమెరా, 80w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7,000mAh బ్యాటరీ, IP69-లెవల్ మన్నిక, సరికొత్త ColorOS 16 సాఫ్ట్‌వేర్‌తో వస్తాయి. పూర్తి ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒప్పో F33 ప్రో 5G, ఒప్పో F33 5G ధర, ఆఫర్లు, కలర్ ఆప్షన్లు :
భారత మార్కెట్లో ఒప్పో F33 ప్రో 5జీ ఫోన్ ధర 8GB + 128GB వేరియంట్ ధర రూ. 37,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 8GB + 256GB మోడల్ ధర రూ. 40,999గా ఉంది. మరోవైపు, ఒప్పో F33 5జీ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ధర రూ. 31,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 128GB మోడల్ ధర రూ. 34,999 కాగా, టాప్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 37,999గా ఉంది.
ఒప్పో F33 ప్రో 5G ఫోన్ మిస్టీ ఫారెస్ట్, స్టార్రీ బ్లూ ప్యాషన్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో F33 5G ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒప్పో F33 ప్రో 5G ఏప్రిల్ 23 నుంచి అమ్మకానికి రానుంది. ఒప్పో F33 5G ఫోన్ ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌లు ఆఫ్‌లైన్ స్టోర్‌లు, ఒప్పో అధికారిక స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఆఫర్ల విషయానికి వస్తే.. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లు, 12 నెలల వరకు ఎక్స్‌టెండెడ్ ఈఎంఐ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఏదైనా డ్యామేజ్ జరిగితే ప్రొటెక్షన్ కోసం 180 రోజుల పాటు, ఫ్రీ స్క్రీన్ ప్రొటెక్షన్‌ను కూడా పొందవచ్చు.
ఒప్పో F33 ప్రో 5G, ఒప్పో F33 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.57-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఒప్పో F33 ప్రో 5జీ, ఒప్పో F33 5జీ ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 6360 MAX ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ అందిస్తాయి. మన్నిక కోసం ఈ ఫోన్‌లు IP69, IP68 IP66 రేటింగ్‌లతో పాటు మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ అందిస్తాయి.
ఈ ఒప్పో ఫోన్లలో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7,000mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతాయి. అనేక ఏఐ ఫీచర్లు, ప్రొడక్టివిటీ టూల్స్‌తో వస్తాయి.
ఒప్పో F33 ప్రో 5జీలో 100-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా-వైడ్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. స్టాండర్డ్ మోడల్ 16MP సెల్ఫీ షూటర్‌ను అందిస్తుంది. బ్యాక్ సైడ్ ఈ రెండు ఫోన్‌లు 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తాయి.
ఒప్పో F33 సిరీస్ ఫోన్లలో ఫోటో ఎడిటింగ్ కోసం క్రియేటివ్ టూల్‌కిట్ ఏఐ ఎడిటర్‌తో కూడా ఉంది. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో పోర్ట్రెయిట్ అద్భుతంగా ఉండేలా చేస్తుంది. ఫ్లాష్‌లైట్, రిమ్ లైట్ లేదా స్టూడియో లైట్ వంటి లైటింగ్ స్టయిల్ ఆటో అప్లయ్ అవుతుంది.
ఈ రెండు ఒప్పో ఫోన్ ఏఐ అల్ట్రా క్లియర్ డాక్యుమెంట్ స్కానర్, ఏఐ రీకంపోజ్, ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఏఐ లైవ్‌ఫోటో 2.0, ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ అన్‌బ్లర్, ఏఐ స్టూడియో, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ ఎరేజర్, ఏఐ రికార్డర్, ఏఐ రైటర్ వంటి ఏఐ-ఆధారిత టూల్స్ సపోర్టు చేస్తాయి.
