Oppo F35 Series : కొత్త ఒప్పో F35 సిరీస్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ఈ నెల 16నే లాంచ్.. ఫుల్ డిటెయిల్స్

Oppo F35 Series : ఈ సిరీస్‌లోని బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 సిరీస్ చిప్‌సెట్ ఉండవచ్చు. ఒప్పో F35 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్‌ ఉండనుంది. పూర్తి ఫీచర్ల వివరాలివే..

  • Published on- September 15, 2026 / 09:12 PM IST

Oppo F35 Series Phones

  • స్టాండర్డ్ మోడల్‌, ఒప్పో F35 ప్రో రెండు ఫోన్లు రానున్నాయి
  • రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉండనుంది
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 10,000mAh వరకు బ్యాటరీ ఉండొచ్చు

Oppo F35 Series : ఒప్పో నుంచి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. చైనాకు చెందిన హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సంస్థ ఒప్పో F35 సిరీస్ కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటు ఒప్పో F35 ప్రో కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వేర్వేరు రియర్ ప్యానెల్ డిజైన్‌లతో వస్తాయని అంచనా.

6 కలర్ ఆప్షన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ల లీకైన ఫొటోల్లో సింగిల్ వేరియంట్ ఫ్లవర్ మోడల్‌తో మరొకటి సీ వేవ్స్ వంటి డిజైన్‌తో కనిపిస్తోంది. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్ సిల్వర్, పింక్, పర్పుల్ కలర్లలో లభ్యం కావచ్చు. ఒప్పో F35 ప్రో ఆరెంజ్, లైట్ బ్లూ, బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

ఒప్పో F35 సన్నని, క్యాప్సల్ షేప్‌లో ఉన్న కెమెరా మాడ్యూల్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో పక్కపక్కనే రెండు కెమెరాలు, రైట్ సైడ్ సర్కిల్ ఫ్లాష్ ఎలిమెంట్ ఉన్నాయి. ఈ సిరీస్‌లో సర్కిల్ కార్నర్లతో ఫ్లాట్ రియర్ ప్యానెల్ ఉంటుందని అంచనా.

Read Also : Motorola Edge 60 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్.. ఈ మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ. 32వేలు ఆదా..!

భారత్ తర్వాత ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఒప్పో F35 సిరీస్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను దేశంలో లాంచ్ చేశారు. అయితే, ఈ సిరీస్ లాంచ్ తేదీ ఇంకా తెలియదు. ఒప్పో F35, ఒప్పో A7 ప్రో, ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లతో హార్డ్‌వేర్‌ను షేర్ చేస్తుందని భావిస్తున్నారు.

కెమెరా ఫీచర్లు అదుర్స్ :
రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఒప్పో F35, ఒప్పో F35 ప్రోలలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లోని బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 సిరీస్ చిప్‌సెట్ ఉంటుందని అంచనా. ఒప్పో F35 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్ ఉంటుందని అంచనా.

ఈ నెల 16నే లాంచ్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లు 10,000mAh వరకు బ్యాటరీలతో వస్తుందని అంచనా. ఒప్పో K14 లైట్ సెప్టెంబర్ 16న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది.

యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని అంచనా. ఒప్పో K14 లైట్‌లో 7,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒప్పో కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది.