OPPO Find X10 Series : దిమ్మతిరిగే ఫీచర్లతో కొత్త ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్.. అక్టోబర్ 21నే లాంచ్.. ఫుల్ డిటెయిల్స్

OPPO Find X10 Series : ఒప్పో ఫైండ్ X10 లాంచ్ టీజర్‌లో కంపెనీ కలర్ వేరియంట్‌లను కూడా వెల్లడించింది. ఈ సిరీస్‌లో లైట్ బ్లూ, వైట్ కలర్ వేరియంట్లు కూడా ఉంటాయి. పూర్తి ఫోన్ వివరాలివే..

OPPO Find X10 Series

  • ఒప్పో ఫైండ్ X10 స్టాండర్డ్ మోడల్ లైట్ బ్లూ కలర్ ఆప్షన్
  • వైట్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది
  • ప్రో మాక్స్ ఫోన్‌లో లూమో ట్యూన్డ్ కెమెరా సెటప్

OPPO Find X10 Series : ఒప్పో లవర్స్ మీకోసమే.. ఒప్పో ఫైండ్ X10 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఈ సిరీస్ లాంచ్ లొకేషన్ కూడా కంపెనీ వెల్లడించింది.

ఈ సిరీస్‌లో స్టాండర్డ్ ఒప్పో ఫైండ్ X10 మోడల్‌తో పాటు హై-ఎండ్ ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ ఉంటాయి. ఫోన్ డిజైన్‌, కలర్ వేరియంట్‌లతో వెల్లడించింది. ఒప్పో ఫైండ్ X10 లాంచ్ ముందు కీలక ఫీచర్లు, కలర్ వేరియంట్లపై ఓసారి లుక్కేయండి..

గ్లోబల్ లాంచ్ ఈవెంట్ :
ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 21న జరగనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ధృవీకరించింది. స్పెయిన్‌లోని మల్లోర్కాలో లాంచ్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

Read Also : Vivo Y600s Pro Launch : 10,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో కొత్త వివో ఫోన్‌.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర జస్ట్ ఎంతంటే?

కలర్ వేరియంట్లు :
ఒప్పో ఫైండ్ ఎక్స్10 లాంచ్ టీజర్‌లో కంపెనీ కలర్ వేరియంట్‌లను కూడా వెల్లడించింది. ఈ సిరీస్‌లో లైట్ బ్లూ, వైట్ కలర్ వేరియంట్లు ఉంటాయని భావిస్తున్నారు. అధికారిక కలర్ ఆప్షన్లు ఇంకా రివీల్ చేయలేదు. స్టాండర్డ్ ఒప్పో ఫైండ్ X10 మోడల్ లైట్ బ్లూ, యాష్, రోజ్ కలర్ ఆప్షన్లలో కనిపించగా, ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ వైట్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కెమెరాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు 4 కెమెరా రింగులు ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌లో హస్సెల్‌బ్లాడ్ బ్రాండెడ్ కెమెరా ఉండగా, ప్రో మాక్స్ ఫోన్‌లో LUMO-ట్యూన్డ్ కెమెరా ఉంటుంది. ఇటీవలి రిపోర్టుల ప్రకారం.. ప్రో మాక్స్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌తో వస్తుందని తెలుస్తోంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ చైనాలో లాంచ్ కాగా 200MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్‌గా నిలిచింది. గ్లోబల్ మోడల్ కెమెరా స్పెసిఫికేషన్లు ఇంకా రివీల్ కాలేదు. ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ 144Hz డిస్‌ప్లే ఉంది.

గ్లోబల్ మోడల్ కూడా ఇలాంటి స్పెసిఫికేషన్లతోనే వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో 8000mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ సిరీస్ త్వరలో భారత మార్కెట్లో కూడా రిలీజ్ కానుంది. అంతర్జాతీయంగా లాంచ్ తర్వాత భారత మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు.