Oppo Find X8 Pro : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 19వేలు డిస్కౌంట్.. ఈ డీల్ అస్సలు వదులుకోవద్దు!
Oppo Find X8 Pro : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రీమియం ఫోన్ రూ. 19వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Updated on- May 4, 2026 / 06:09 PM IST
Oppo Find X8 Pro
- భారత్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రూ. 99,999 ధర మాత్రమే
- ఈ ఫోన్ రూ. 84,999 ధరకు లభిస్తోంది.. రూ. 15వేలు నేరుగా తగ్గింపు
- బ్యాంకు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేసుకోవచ్చు
Oppo Find X8 Pro : ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 19వేల తగ్గింపుతో లభిస్తోంది.
అడ్వాన్స్ కెమెరా సెటప్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ప్రీమియం డిజైన్‌కు హై-ఎండ్ కేటగిరీలో లభిస్తుంది. ఇలాంటి ఆఫర్లు లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీకు ఆసక్తి ఉంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
ఒప్పో ఫైండ్ X8 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఫోన్ రూ. 99,999 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రీమియం (Oppo Find X8 Pro) ఫోన్ ప్రస్తుతం రూ. 84,999 ధరకు లభిస్తోంది. రూ. 15వేలు నేరుగా ధర తగ్గింపు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత ఆదా కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్-ఇన్ చేయవచ్చు.
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ అమర్చి ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,910mAh బ్యాటరీ ఉంది.
కెమెరాల విషయానికి వస్తే, ఒప్పో ఫైండ్ X8 ప్రోలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ LYT808 మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6x ఆప్టికల్ జూమ్ 120x వరకు డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 లెన్స్, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫోన్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో కొనాలా వద్దా? :
పాత జనరేషన్ ఫోన్ అయినా ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. పవర్‌ఫుల్ కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. కెమెరా క్వాలిటీ, బ్యాటరీ మన్నికతో మొత్తం మీద ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే యూజర్లకు ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆప్షన్.
