Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేస్తోంది.. ఈ స్మార్ట్ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. మే 8 నుంచే బిగ్ డీల్స్
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 8 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా, ఐక్యూ 15ఆర్, షావోమీ ప్యాడ్ 8 వంటి డివైజ్ లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. పూర్తి వివరాలివే..
Amazon Great Summer Sale
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లతో 10శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్
- శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ. 94,999కి తగ్గింపు
- ఐక్యూ నియో 10, గెలాక్సీ M సిరీస్‌పై డిస్కౌంట్లు
Amazon Great Summer Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అతి త్వరలో రాబోతోంది. ఈ వారం చివరి నాటికి సేల్ ప్రారంభమవుతుంది. మీరు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా హోం అప్లియన్సెస్ వంటి కొత్త ఎలక్ట్రానిక్ డివైజ్ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ సేల్ సమయంలో భారీగా తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
ఆసక్తిగల వినియోగదారులు తమకు ఇష్టమైన ప్రొడక్టులపై ఎక్కువ డిస్కౌంట్లను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో (Amazon Great Summer Sale) ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. అనేక బెనిఫిట్స్, ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు, డీల్స్, అడ్వాన్స్ యాక్సెస్, బ్యాంక్ ఆఫర్లు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు, అడ్వాన్స్ యాక్సెస్, బ్యాంక్ ఆఫర్లు :
ఈ సేల్ మే 8న ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. అమెజాన్ అన్ని బెనిఫిట్స్ ఇంకా ప్రకటించలేదు. వినియోగదారులు విష్లిస్ట్లను క్రియేట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డీల్స్‌ను ట్రాక్ చేసే టీజర్, బ్యానర్లు సూచిస్తున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈజీ ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సేల్ టైంలో అమెజాన్ నిబంధనలు, షరతులకు లోబడి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా ఈజీ ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్ నేరుగా వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డులపై అదిరిపోయే డిస్కౌంట్లు :
మీరు ప్రైమ్ మెంబర్ అయితే లేదా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. అన్ లిమిటెడ్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎంపిక చేసిన కొనుగోళ్లపై ఫ్లాట్ డిస్కౌంట్లు లేదా రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్ వంటి ఇతర లిమిటెడ్ టైమ్ ఆఫర్లను కూడా పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీ, ముందస్తు డీల్స్ :
అమెజాన్ ఎలక్ట్రానిక్స్ హోం అప్లియన్సెస్ డిస్కౌంట్లను అందిస్తోంది. షావోమీ ప్యాడ్ 8 ధర రూ. 30,999 (గతంలో రూ. 37,999), ఐక్యూ 15ఆర్ ధర రూ. 42,999 (గతంలో రూ. 53,999), జేబీఎల్ 800 ప్రో సౌండ్‌బార్ ధర రూ. 49,999 (గతంలో రూ. 69,999)కు లభిస్తుంది.
మే 5న ప్రారంభమయ్యే అమెజాన్ ఎర్లీ యాక్సెస్‌తో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ. 94,999కి తగ్గనుంది. శాంసంగ్ గెలాక్సీ M17 5జీ ఫోన్ రూ. 13,999కి, శాంసంగ్ గెలాక్సీ M56 రూ. 21,999కి అందుబాటులో ఉంటాయి. ఐక్యూ నియో 10 ధర రూ. 34,999కు లభించనుంది.
