OPPO K14 Lite : ధర చూస్తే వావ్.. బ్యాటరీ చూస్తే డబుల్ వావ్! ఒప్పో చీపెస్ట్ ఫోన్ ఇదిగో..!
OPPO K14 Lite : ఒప్పో K14 లైట్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ సెప్టెంబర్ 16న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీ ఉంటుంది.
- Sreehari A
- Published on- September 13, 2026 / 08:09 PM IST
OPPO K14 Lite
- ఒప్పో నుంచి సరసమైన సరికొత్త ఫోన్ రాబోతుంది
- సెప్టెంబర్ 16న ఈ ఒప్పో కె14 లైట్ లాంచ్ కానుంది
- CPH3007 మోడల్ నంబర్‌తో BISలో లిస్టింగ్
OPPO K14 Lite : ఒప్పో ఫ్యాన్స్ మీకోసమే.. ఒప్పో ఇండియా K14 సిరీస్‌లో మరో సరసమైన ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ 7000mAh బ్యాటరీ ఫోన్ లాంచ్ తేదీని చెప్పేసింది. ఈ ఫోన్ ఇటీవల భారతీయ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ BISలో కూడా లిస్టు అయింది. ఒప్పో ఫోన్ CPH3007 మోడల్ నంబర్‌తో BISలో చూడొచ్చు. అయితే, లాంచ్ తేదీతో పాటు కంపెనీ ఈ ఫోన్ కొన్ని ఫీచర్లను కూడా అధికారికంగా ధృవీకరించింది.
సెప్టెంబర్ 16నే లాంచ్ :
ఒప్పో ఇండియా సోషల్ మీడియాలో ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ కలర్ వేరియంట్లు, బ్యాటరీ సామర్థ్యం వంటి పూర్తి వివరాలను కూడా షేర్ చేసింది. కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం.. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీతో రానుంది. అదిరిపోయే డిజైన్‌తో వస్తుంది. ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ పర్పుల్ బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Also : Post Office FD : మీకు పోస్టాఫీసులో FD ఉందా? 365 రోజుల ఖాతాపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్!
ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో A6c 4జీ మాదిరిగానే ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. 4జీ కనెక్టివిటీతో రానుంది. అయితే, కంపెనీ ఈ ఫోన్ సంబంధించి కీలక వివరాలను ఇంకా రివీల్ చేయలేదు. ఒప్పో A6c 4జీ మాదిరిగానే ఈ ఫోన్ కూడా 4GB ర్యామ్ + 64GB, 4GB ర్యామ్ + 128GB అనే 2 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుందని అంచనా. ఈ ఫోన్ ధర రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ ధర రూ. 16,999గా ఉంది.
ఒప్పో A6c 4జీ ఫీచర్లు :
ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఒప్పో ఫోన్‌లో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ చైనీస్ కంపెనీకి చెందిన ఫోన్ యూనిసోక్ T7250 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 4GB ర్యామ్, 128GB వరకు స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీ ఉంది. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP కెమెరా కూడా అందించారు.
