Oppo K14 Plus Launch : కెమెరా లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఒప్పో K14 ప్లస్ వస్తోంది.. తక్కువ ధరలో 4K కెమెరా ఫోన్!
Oppo K14 Plus Launch : కొత్త కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో నుంచి K14 ప్లస్ ఫోన్ రాబోతుంది. 4K వీడియో రికార్డింగ్ కెమెరాలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. పూర్తి ఫోన్, ధర వివరాలివే..
- Sreehari A
- Published on- September 24, 2026 / 06:29 PM IST
Oppo K14 Plus Launch
- ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది
- ఒప్పో K14 ప్లస్ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలివే
- సెప్టెంబర్ 29న భారత మార్కెట్లో లాంచ్
Oppo K14 Plus Launch : ఒప్పో లవర్స్ మీకోసమే.. ఒప్పో K14 ప్లస్ ఫోన్ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 29న ఈ కొత్త ఫోన్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఒప్పో K14X, K14 లైట్ తర్వాత K-సిరీస్‌లో ఇది నాల్గో మొబైల్.
రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఆసక్తిగల కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉండనుంది. ఒప్పో ఈ కొత్త ఫోన్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లను ముందుగానే రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఒప్పో K14 ప్లస్ ఫీచర్లు (అంచనా) :
ఒప్పో K14 ప్లస్ 6.77-అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్‌తో పాటు 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఉంటాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ కలర్‌ఓఎస్ 16తో రన్ అవుతుంది. డ్యూయల్ బ్యాక్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఇప్పటివరకు వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ లెన్స్ ఉంటుంది. అలాగే, ఈ డివైజ్ ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చు. అంతేకాదు.. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఫోన్ ఎక్కువగా వాడినా హీట్ కాకుండా ఇందులో 5,000mm వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69K రేటింగ్ వంటివి ఉంటాయని అంచనా.
భారత్‌లో ఒప్పో K14 ప్లస్ ధర (అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 29, 2026న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుందని ఒప్పో వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ యూనిక్ ప్రొడక్టుగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ధర విషయానికి వస్తే.. ఈ ఒప్పో ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర సుమారు రూ. 28,999 నుంచి రూ. 30వేల వరకు ఉండే అవకాశం ఉంది.
