Oppo K15 Launch : ఒప్పో లవర్స్ మీకోసమే.. కొత్త ఒప్పో K15 లాంచ్ డేట్ ఇదే.. కీలక ఫీచర్లు లీక్..
Oppo K15 Launch : ఒప్పో కె15 సిరీస్ లాంచ్ అయింది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ లిస్టింగ్ అయింది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుందని అంచనా.
- Sreehari A
- Published on- July 17, 2026 / 03:49 PM IST
Oppo K15 Launch
- ఒప్పో K15 కీలక స్పెషిఫికేషన్లు లీక్
- 8,000mAh బ్యాటరీ సెటప్, డ్యూయల్ రియర్ కెమెరా
- ఒప్పో K15లో మీడియాటెక్ చిప్‌సెట్ ఆప్షన్
Oppo K15 Launch : కొత్త ఒప్పో K15 వచ్చేస్తోంది. ఈ ఒప్పో కొత్త మోడల్ వచ్చే వారం చైనాలో లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ కొత్త ఒప్పో ఫోన్ చైనాలోని కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో లిస్ట్ అయింది. కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, డిజైన్, కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్లు రివీల్ అయ్యాయి.
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ కూడా ఉంటుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
జూలై 24న చైనాలో ఒప్పో K15 లాంచ్ :
ఒప్పో K15 స్మార్ట్‌ఫోన్ జూలై 24న లాంచ్ కానుంది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ లిస్టింగ్ అయింది. ప్రస్తుతం దేశంలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఒప్పో K15 కనీసం 12జీబీ + 256GB ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో చైనాలో అమ్మకానికి రానుంది. గేల్ గ్రే, రాపిడ్ వైట్ అనే 2 కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్ల పరంగా.. :
ఒప్పో K15 ఫోన్ 6.59-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో లాంచ్ కానున్నట్లు ధృవీకరించింది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. రాబోయే ఒప్పో K15లో టైడల్ ఇంజిన్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్ అందిస్తుంది. రెండు ప్రో మోడళ్ల మాదిరిగానే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కూడా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ అమర్చి ఉంటుంది.
ఒప్పో K15 ఫోన్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సొల్యూషన్‌తో వస్తుంది. 4,950 చదరపు మిల్లీమీటర్ల హీటింగ్ ఆప్షన్ అందిస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ గేమింగ్ సమయంలో ఫోన్ హీట్ కాకుండా నివారిస్తుంది. ఒప్పో K15లో 8,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ గ్లేసియర్ బ్యాటరీ ఎనర్జీ గ్యాదరింగ్ చిప్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. :
ఒప్పో K15 ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. అదనంగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. నావిగేషన్ కోసం డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్ త్రీ-ఫ్రీక్వెన్సీ బీడౌ (BeiDou)కు కూడా సపోర్టు ఇస్తుంది.
