Oppo K15 Launch : ఒప్పో కొత్త ఫోన్ కేక.. 8,000mAh బ్యాటరీతో కిర్రాక్ అంతే.. ధర ఎంతో తెలుసా?

Oppo K15 Launch : ఒప్పో కె15 ఫోన్ 8,000mAh బ్యాటరీ, డ్యూయల్ 50MP రియర్ కెమెరాలతో వచ్చేసింది. ఈ ఒప్పో ఫోన్ ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

Oppo K15 Launch

  • ఒప్పో K15 ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది
  • 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది
  • 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది

Oppo K15 Launch : ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. టెక్ సంస్థ ఒప్పో K15 సిరీస్‌లో మూడవ ఫోన్ ఒప్పో K15 చైనాలో లాంచ్ అయింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఒప్పో K15 ప్రో, ఒప్పో K15 ప్రో ప్లస్ తర్వాత ఇది మూడో మోడల్. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం దేశంలో కంపెనీ వెబ్‌సైట్ ద్వారా సింగిల్ ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అమ్మకానికి ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఒప్పో K15 ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఒప్పో ఫోన్ 8,000mAh బ్యాటరీతో (Oppo K15 Launch) పాటు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ కూడా ఉంది.

ఒప్పో K15 ధర ఎంతంటే? :
12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ ఒప్పో K15 ధర CNY 2,299 (సుమారుగా రూ. 33వేలు)గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో ఒప్పో చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఒప్పో K15 గేల్ గ్రే రాపిడ్ వైట్ కలర్ ఆప్షన్లలో కొనేసుకోవచ్చు.

ఒప్పో K15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో K15 ఫోన్ అనేది డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒప్పో లేటెస్ట్ కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.59-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,256 x 2,760 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.

Read Also : Flipkart Food Delivery : ఫుడ్ ప్రియులకు పండగే.. జొమాటో, స్విగ్గీలకు చెక్.. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు..!

120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ రంగులు, 100 శాతం DCI-P3 కలర్ గామట్, 460ppi పిక్సెల్ డెన్సిటీ 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌తో వస్తుందని టెక్ సంస్థ పేర్కొంది.

ఒప్పో K15లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్‌సెట్ ఉంది. 2.5GHz టాప్ క్లాక్ స్పీడ్‌ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఏఆర్ఎమ్ మాలి-G615 జీపీయూ, 12GB LPDDR4x, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ టైడల్ ఇంజిన్ కూడా ఉన్నాయి. హీట్ మేనేజ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ 4,950 చదరపు మిల్లీమీటర్ల హీట్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

కెమెరాల విషయానికొస్తే..
ఒప్పో K15లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఆటోఫోకస్, డ్యూయల్-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 10x వరకు డిజిటల్ జూమ్‌తో 50MP (ఎఫ్/1.8) మెయిన్ కెమెరా, 143-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP (ఎఫ్/2.2) అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆటోఫోకస్‌తో 50MP (ఎఫ్/2.0) ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4K/30fps వరకు వీడియోలను రికార్డ్ చేయొచ్చు.

ఒప్పో K15లో 8,000mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్టీఈ, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, BeiDou, జీపీఎస్, GLONASS, Galileo, QZSS, NavICలకు కూడా సపోర్ట్ చేస్తుంది.

సెన్సార్ల లిస్టులో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఒక ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ కొలతలు 158.3×75.13×8.31mm బరువు, సుమారు 206 గ్రాములు ఉంటుంది.