Global Chip Shortage: ఫోన్లు, ల్యాప్ టాప్‌లు 2022 వరకూ అధిక ధర పలకడానికి కారణం

ప్రస్తుతం గ్లోబల్ సెమీ కండక్టర్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలపై ప్రభావం చూపిస్తున్నాయి. కేవలం స్మార్ట్ ఫోన్లపైనే కాకుండా కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ ...

Global Chip Shortage: ప్రస్తుతం గ్లోబల్ సెమీ కండక్టర్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు ఇండస్ట్రీలపై ప్రభావం చూపిస్తున్నాయి. కేవలం స్మార్ట్ ఫోన్లపైనే కాకుండా కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లు ఏమైనా సరే. వాహనాలు, ఇతర మెషినరీలకు కూడా ఇదే సమస్య 2022వరకూ ఉండొచ్చని అంటున్నారు.

ఓ ప్రైవేట్ సంస్థ చేసిన స్టడీ ప్రకారం.. 2021 మొత్తం గ్లోబల్ సెమీ కండక్టర్ కొరత అనేది తప్పకుండా ఉంటుంది.2022 అర్ధభాగం పూర్తయితేనే గానీ సాధారణ స్థాయికి చేరుకోవు.

దానికి కారణం:
డిమాండ్, సప్లైలపై కొవిడ్-19 భారం తీవ్రంగా పడింది. ప్రతి గ్యాడ్జెట్ కు కచ్చితంగా లోపలి భాగంలో చిప్ ఉండాల్సిందే. అది ఫ్రిజ్, కార్, స్మార్ట్ స్పీకర్ ఏదైనా సరే. 2020లో మహమ్మారి రావడంతో ఎలక్ట్రానిక్స్ వినియోగం, చిప్స్ పై డిమాండ్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ మాత్రం లేకుండాపోయింది.

స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో ఈ కొరత బాగా కనిపించింది. డిమాండ్ కంటిన్యూ చేయడానికి చిప్ మ్యాన్యుఫ్యాక్చరర్లు నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్య వారానికి మించి ఉండదని తెలుస్తోంది.

డిమాండ్ ను సొమ్ము చేసుకునే ఉద్దేశ్యంతో చిప్ ధరలు పెంచుతున్నాయి ప్రొడక్షన్ కంపెనీలు. ఫలితంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల ధరలు కూడా ఆకాశానికి చేరుకుంటున్నాయి. మొదట్లో ఈ సమస్య పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డిస్ ప్లే డివైజెస్, మైక్రో కంట్రోలర్స్ లలో కనిపించింది. ఇప్పుడు ఇది ఇతర డివైజ్ లలోనూ కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు