POCO C85 5G : సూపర్ డిస్కౌంట్ మావా.. ఈ కొత్త పోకో 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

POCO C85 5G : ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొత్త పోకో సీ85 5జీ ఫోన్ కొనుగోలు చేస్తే భారీగా అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

POCO C85 5G

  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అసలు ధరపై 31శాతం తగ్గింపుతో పొందవచ్చు
  • ఈ ఫోన్‌పై రూ. 5 వేలకు పైగా డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తుంది
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ కూడా ఉంది

POCO C85 5G : కొత్త పోకో ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో పోకో C85 5G భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ 5జీ ఫోన్ బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 31 శాతం తగ్గింపుతో పోకో C85 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 50MP కెమెరా సెటప్, భారీ 6000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉంది. పోకో C85 5జీపై బెస్ట్ ఆఫర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పోకో C85 5G ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే పోకో సి85 5జీ ఫోన్ (POCO C85 5G Launch) లభిస్తోంది. ఈ ఫోన్‌  (POCO C85 5G Launch) రూ. 20,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు రూ. 14,499 తగ్గింపు ధరకు లభిస్తోంది. అంటే.. రూ. 5వేలకు పైగా బ్యాంకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు :
పోకో C85 5జీ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా రూ. 725 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌ను రూ. 6వేలు తక్కువకే సొంతం చేసుకోవచ్చు. తద్వారా ఈ పోకో ఫోన్ ధర రూ 13,774 మాత్రమే అవుతుంది.

పోకో C85 5జీ స్పెసిఫికేషన్లు :
పోకో C85 5జీ ఫోన్ 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్ 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే టీయూవీ రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్ అందిస్తుంది. మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Read Also : Oppo Reno 16 Series : 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో రచ్చ చేయబోతున్న ఒప్పో రెనో 16 సిరీస్.. ఫీచర్లు చూస్తే షాక్..!

ఇందులో 4GB, 6GB,8GB,LPDDR4X ర్యామ్, 128GB UFS2.2 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. 8GB వరకు వర్చువల్ ర్యామ్ విస్తరణకు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2.2 పై రన్ అవుతుంది. కంపెనీ రెండు మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. పోకో C85 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. సేఫ్టీ కోసమైతే ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది.

33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. కొలతల పరంగా 171.56mm పొడవు, 79.49mm వెడల్పు, 7.99mm మందం, 211 గ్రాముల బరువు ఉంటుంది.